Site icon vidhaatha

KGF విల‌న్‌ను పెళ్లాడ‌బోతున్న స్టార్ హీరోయిన్‌..!

Haripriya | హ‌రిప్రియ శాండ‌ల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్‌. తెలుగుతో పాటు ప‌లు ద‌క్షిణాది చిత్రాల్లోనూ న‌టించింది. బెంగ‌ళూరులో జ‌న్మించిన హ‌రిప్రియ చిక్క‌బ‌ళ్ల‌పుర‌లో పెరిగింది. ఆమె తండ్రి నటుడు కాగా, ఆమె తాత నాటక రంగ ప్రముఖుడు కావ‌డం విశేషం.

చ‌దువు త‌ర్వాత హరిప్రియ భ‌ర‌త‌నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టి.. అక్క‌డి నుంచి సినిమా రంగ ప్ర‌వేశం చేసింది. 2008లో ఓ కన్నడ చిత్రంలో న‌టించింది. అనంతరం నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘పిల్ల జమిందార్’లో జ‌త‌ క‌ట్టింది.

వీటితో పాటు అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ చిత్రం త‌ర్వాత బాలకృష్ణ ‘జైసింహా’తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇంత‌కీ ఈ విష‌య‌మంతా ఎందుకంటే.. ఇప్పుడు ఈ భామ క‌న్న‌డ, తెలుగు చిత్రాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ న‌టుడిని పెళ్లాడ‌బోతున్న‌ది. అత‌ను ఎవ‌రో కాదు.. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ‘కేజీఎఫ్‌’లో ఒక విల‌న్‌గా న‌టించిన వశిష్ఠ ఎన్. సింహా. కన్నడంలో పలు సినిమాల్లో న‌టించాడు. కేజీఎఫ్ సినిమా హిట్ సాధించిన త‌ర్వాత చాలా చిత్రాల్లో అవ‌కాశాలు వెళ్లువెత్తాయి.

తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో కీల‌క పాత్రలు పోషించాడు. అయితే చాలాకాలంగా ప్రేమించుకుంటున్న వీరు ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నిశ్చితార్థం నిరాడంబ‌రంగా జ‌రిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version