Site icon vidhaatha

బాలయ్యకి తెగ నచ్చేసింది.. NBK108లో హనీరోజ్‌..!

విధాత‌: బాలయ్య చిత్రాలంటే అవి ద్విపాత్రాభిన‌యంతో రూపొందుతాయని అందరూ భావిస్తారు. కుర్ర బాలయ్యకు కొత్త కొత్త హీరోయిన్లను వెతికి పట్టుకుంటూ ఉంటారు. కానీ ఓల్డ్ బాలయ్య విషయానికి వస్తే ఆయనతో ఒక చిత్రం చేసిన హీరోయినే మరలా మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. గతంలో సిమ్రాన్ నుంచి రాధిక ఆప్టే వరకు ఇందుకు ఎంద‌రినో ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో యంగ్ బాలయ్యకు శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా ఓల్డ్ బాలయ్యకు మలయాళం నటి హ‌నీరోజ్ భార్యగా నటించి మార్కులు కొట్టేసింది. హ‌ని రోజ్ సినిమా ప్ర‌థ‌మార్థంలో ఓల్డ్ క్యారెక్టర్ గా ద్వితీయార్ధంలో యంగ్ బ్యూటీగా కనిపించి మెప్పించింది. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

వాస్తవానికి వీరసింహారెడ్డిలో శృతిహాసన్ కంటే హనీ రోజుకే ప్రాధాన్యం ఉంది. 2005లో మలయాళంలో బాయ్ ఫ్రెండ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి రెండు చిత్రాలలోను నటించింది. కానీ ఇవి పెద్దగా ఆడ లేదు. ఆ తర్వాత తన మాతృ భాష మలయాళంలోనే సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది.

కేవలం సెలక్టివ్‌ పాత్రలను మాత్రమే చేస్తుందన్న పేరు హనీరోజ్‌కు ఉంది. ఇటీవల మోహన్‌లాల్‌ హీరోగా మళయాళంలో వచ్చిన మాన్‌స్టర్‌ చిత్రంలో లెస్బియన్‌గా నటించిన తోటి నటి మంచు లక్ష్మి ప్రసన్నతో లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. ఇండస్టీకి వచ్చిన మొదట్లోనే ఓ సినిమాలో నాన్‌స్టాప్‌ లిప్‌లాక్‌ చేసి అన్ని సినీ ఇండస్ట్రీలను షాక్‌ గురి చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటుంది.

అయితే తాజాగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్.బి.కే 108 చిత్రంలో మరోసారి హ‌నిరోజ్‌కు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఇందులో శరత్ కుమార్ కీలకపాత్రలో న‌టిస్తున్నారు. వీరసింహారెడ్డిలో కూతురు వరలక్ష్మి కీలకపాత్రను చేస్తే అనీల్ రావిపూడి చిత్రంలో తండ్రి కీలకపాత్రను పోషించనుండడం విశేషం.