Site icon vidhaatha

15-02-2023 బుధ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశివారికి అవమానాలు..!

మేషం : ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా స్వంతంగా ప‌నులు నిర్వ‌హించండి. ధ‌న వ్య‌య‌ము పెరుగుతుంది. బాధ‌లు క‌లుగ‌వ‌చ్చును. నిరుత్సాహ‌ము బాధిస్తుంది.

వృష‌భం : సినిమా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కార్య‌సాధ‌న‌కై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. జీవిత భాగ‌స్వామి స‌హకారం అందుతుంది. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి.

మిథునం : అధికారుల మెప్పును పొందుతారు. శ‌త్రువులు మిత్రుల‌వుతారు. కొన్ని సంభాష‌ణ‌లు సంతోషాన్ని క‌లిగిస్తాయి. దానధ‌ర్మాలు నిర్వ‌హిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలోని వారికి స‌త్ఫ‌లితాలు ల‌భిస్తాయి.

క‌ర్కాట‌కం : సంతాన మూల‌క సౌఖ్య‌ము ల‌భిస్తుంది. సామాజిక బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారు. నూత‌న కార్య రంభ‌మున‌కు సంక‌ల్పిస్తారు. అప‌వాదులు తొల‌గిపోతాయి. ఆల‌స్య‌మైన‌నూ రావాల్సిన ధ‌నం చేతికందుతుంది.

సింహ : భాగ‌స్వాముల‌తో వివాదాలు ఏర్ప‌డ‌వ‌చ్చును. అధిక సంచార‌ము చేయాల్సి వ‌స్తుంది. త‌ల్లిదండ్రుల‌కు అనారోగ్య‌మూల‌కంగా మ‌నో వ్య‌ధ క‌ల‌గ‌వ‌చ్చును. అకాల భోజ‌నం వ‌ల‌న శ‌రీరం బ‌ల‌హీనంగా ఉంటుంది.

క‌న్య : దూర ప్రాంతాల నుంచి లాభం క‌లుగుతుంది. అనారోగ్య బాధ‌లు ఉప‌శ‌మిస్తాయి. ప‌రోప‌కార‌ములు చేస్తారు. ఆత్మ‌స్థైర్య‌ముతో అనుకున్న‌ది సాధిస్తారు. శత్రు ప‌రాజ‌యం సంతోషాన్నిస్తుంది.

తుల : చోర బాధ‌లు క‌లుగ‌వ‌చ్చును. వైద్యుల‌ను సంప్ర‌దిస్తారు. సోద‌ర వ‌ర్త‌ముతో విరోధ‌ములేర్ప‌డ‌వ‌చ్చును. అనుకోని చిక్కుల మూల‌కంగా చికాకు క‌లుగుతుంది. రుణ‌మూల‌క అశాంతి క‌లుగ‌వ‌చ్చును.

వృశ్చికం : త‌ల్లి త‌ర‌పు బంధువుల మూల‌కంగా సంతోష‌ము క‌లుగుతుంది. మీ అంచ‌నాలు నిజ‌మ‌వుతాయి. శ్రేయోభిలాషుల‌కు స‌రైన సూచ‌న‌లు అందిస్తారు. మొండి బాకీల‌ను జాగ్ర‌త్త‌గా రాబ‌డుతారు.

ధ‌నుస్సు : ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. న‌ష్ట‌పోయామ‌నుకున్న ధ‌న‌ము రావొచ్చును. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ఉద్యోగార్థుల ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. స్థిరాస్థి వ్య‌వ‌హారాలు ఒక కొలిక్కి వ‌స్తాయి.

మ‌క‌రం : కోర్టు వ్య‌వ‌హాలు లాభిస్తాయి. పోలీసుల‌కు వృత్తిరీత్యా గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. దైవానుగ్ర‌హం సంతోసాన్నిస్తుంది. శుభ‌కార్యాలు ఆచ‌రిస్తారు. ధ‌న‌ధాన్య స‌మృద్ధి క‌లిగి ఉంటారు.

కుంభం : ప్ర‌ముఖుల‌తో క‌ల‌యిక‌లు లాభం చేకూరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్ర‌మ ఎక్కువైన‌ను గౌర‌వం పెరుగుతుంది. సంక‌ల్పించిన ప‌నులు ముందుకు సాగ‌డంతో సంతోషం క‌లుగుతుంది. వివాదాల్లో విజ‌యం సాధిస్తారు.

మీనం : నిరుత్సాహ మూల‌కంగా ప‌నులు వాయిదా వేస్తారు. బంధువ‌ర్గంలో అవ‌మానాల‌ను ఎదుర్కొంటారు. చేసే ప‌నుల‌ను మ‌ధ్య‌లో వ‌దిలేయాల్సి వ‌స్తుంది. దూర ప్రాంతాల‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. అధిక వ్య‌యం క‌లుగ‌వ‌చ్చును.

Exit mobile version