17-03-2023 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు బంగారం కొంటారు..!

మేష రాశి : రాజకీయ నాయకుల ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. బంధుమిత్రుల కలయికలు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి : ఉద్యోగ మూలకంగా అశాంతి కలుగవచ్చును. దూర ప్రాంతాలకు వెళ్లడం వలన అసౌకర్యంగా ఉంటుంది. తండ్రి వర్గం వారితో విభేదాలు వచ్చే అవకాశమున్నది. ప్రయత్నం కార్యములు ఆలస్యం కావచ్చును. మిథున రాశి : దాచుకున్న ధ‌నం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. తొందరపాటు పనికిరాదు. […]

  • Publish Date - March 17, 2023 / 06:36 AM IST

మేష రాశి : రాజకీయ నాయకుల ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. బంధుమిత్రుల కలయికలు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి.

వృషభ రాశి : ఉద్యోగ మూలకంగా అశాంతి కలుగవచ్చును. దూర ప్రాంతాలకు వెళ్లడం వలన అసౌకర్యంగా ఉంటుంది. తండ్రి వర్గం వారితో విభేదాలు వచ్చే అవకాశమున్నది. ప్రయత్నం కార్యములు ఆలస్యం కావచ్చును.

మిథున రాశి : దాచుకున్న ధ‌నం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. తొందరపాటు పనికిరాదు. మనసులో తెలియని ఆందోళన కలిగే అవకాశమున్నది. భోజన నియమాలు పాటించండి. ధన వ్యయం కలగవచ్చును.

కర్కాటక రాశి : స్థిరాస్థి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సత్ప్రవర్తనతో గౌరవాన్ని పొందుతారు. బంధువుల నుండి రావలసిన ధనం చేతికందుతుంది. అనుకోని ప్రమాదాల నుండి బయటపడతారు.

సింహ రాశి : మనసును కదిలించే మాటలను వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనం సంతోషాన్నిస్తోంది. తగిన గౌరవాన్ని పొందుతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధన ప్రాప్తి సంతోషం కలిగిస్తుంది.

కన్యా రాశి : కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. శత్రువులు మిత్రులవుతారు. క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైద్య రంగంలో వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి : ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయవలసి వస్తుంది, కనుక జాగ్రత్త వహించండి. ప్రయాణమూలక అశాంతి కలగవచ్చును. వాహన మూలకంగా వ్యయం చేయవలసి వస్తుంది. భయం వదలండి లేకుంటే పనులు ముందుకు సాగవు.

వృశ్చిక రాశి : జీవిత భాగస్వాములతో కఠినంగా వ్యవహరించకండి. సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగవచ్చును. ఇతరులపై ఆధారపడడం తగ్గించండి. శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి : బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం లభించవచ్చు. నష్టపోయిన చోటనే తిరిగి లాభం పొందే అవకాశమున్నది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను వింటారు.

మకర రాశి : మంచి వ్యక్తులను కలియటం వలన ఆనందాన్ని పొందుతారు. దానధర్మాది మంచి కార్యములను చేస్తారు. బహుమానములను పొందుతారు. భోజన సౌఖ్యం కలుగుతుంది.

కుంభ రాశి : ప్రయాణంలో మూలకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. చేయవలసిన పనులను వాయిదా వేస్తారు. బంధు, మిత్రుల విరోధములు బాధించవచ్చును. వివాహ ప్రయత్నంలో నెమ్మదిస్తాయి.

మీన రాశి : ధన ధాన్య లాభములు కలగవచ్చును. భూములు క్రయవిక్రయముల వలన లాభం కలుగుతుంది. మాట్లాడేటప్పుడు సమయమనం పాటించండి. ఇంట్లో శుభములు కలుగును కలుగవచ్చును.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

Latest News