Site icon vidhaatha

ICC World Cup 2023 | ప్రపంచకప్ స్పెషల్ సాంగ్.. దుమ్ములేపిన రణవీర్ సింగ్

ICC World Cup 2023

విధాత: ఐసీసీ పురుషుల క్రికెట్‌ వన్డే ప్రపంచ కప్-2023 మరో రెండు వారాల వ్యవధిలో ప్రారంభం కానుండగా భారత్‌లో క్రికెట్ సందడి జోరందుకుంటుంది. ఆక్టోబర్ 5నుంచి నవంబర్ 19వరకు జరుగనున్నఈ మెగాటోర్ని ప్రచారానికి సంబంధించి ఐసీసీ అధికారిక సాంగ్‌ను విడుదల చేసింది. వన్‌ డే ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణంలో దిల్ జషన్ జషన్ బోలే అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ అభిమానులను అలరిస్తుంది.

ఈ సాంగ్‌లో స్టార్ హీరో రణవీర్‌సింగ్ నటించగా, ప్రీతమ్ చక్రవర్తి కంపోజ్ చేశారు. రణవీర్‌తో పాటు టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఆడి పాడారు. సోషల్ మీడియా యాప్‌లలో అందుబాటులో ఉన్న ఈ సాంగ్ వైరల్‌గా మారింది. త్వరలో అభిమానులు ఈ సాంగ్‌ను బిగ్ ఎఫ్‌ఎం, రెడ్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో కూడా విని ఆనందించవచ్చు.

Exit mobile version