Tamannaah |
తమన్నా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్ళు కావస్తుంది. తెలుగు తెరకు పరిచయం అయిన కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే పెద్ద హీరోలందరి సరసనా నటించేసింది. తక్కువ సమయంలోనే మంచి పేరు, అవకాశాలను చేజిక్కించుకుంది తమన్నా.
అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం తను లిప్ లాక్ సీన్లు, బోల్డ్ సీన్లలో మాత్రం నటించలేనని పదే పదే చెప్పుకొచ్చేది. ఇప్పుడు ఇంత పేరు, డబ్బు సంపాదించుకున్నాక మాత్రం.. తమన్నా తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమధ్య ఆమె నటనలో వచ్చిన మార్పును చూసి నోరెళ్లబెడుతున్నారు జనం.
ఒకప్పుడు సాంప్రదాయంగా కనిపించే తమన్నాలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో సరిగా తెలియకపోయినా, అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారి పోతుందేంటనే గుసగుసలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. వెబ్ సిరీస్‌లలో ఘాటు సీన్స్, బోల్డ్ సీన్స్‌లలో నటించేస్తూ, యమా బిజీ అయిపోతుంది ఈ మిల్కీ బ్యూటీ.
అయితే ఆమె హాట్ లుక్స్, గ్లామర్ షోలపై నటుడు బయిల్వాన్ రంగనాథన్ ఈమధ్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎంత దారుణంగా ఆయన కామెంట్స్ చేశాడంటే.. ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
తమన్నా రీసెంట్‌గా చేసిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో ముద్దు సీన్స్, ఇంకా బెడ్ సీన్స్‌కు గాను ఏడు కోట్ల వరకూ తీసుకుంది. మామూలుగా అయితే ఆమె నటనకు రెండు నుంచి ఐదు కోట్ల వరకూ మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేది. ఇందులో ముద్దు సీన్స్ ఉన్నాయి.. కనుక ఏడు కోట్లు డిమాండ్ చేసింది.
అదే ఇంకో రెండు కోట్లు కనుక ఎక్కువ ఇస్తే చూపించేవి, చూపించకూడనివి కూడా చూపించేస్తుందని చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు బయిల్వాన్ రంగనాథన్. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. విశేషం ఏమిటంటే.. కొందరు నెటిజన్స్ కూడా రంగనాథన్ కామెంట్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు.
వయసు పెరుగుతున్నకొద్దీ తమన్నాలో వస్తున్న మార్పు చాలా చిరాగ్గా ఉందని, ఆమె రోజు రోజుకూ దిగజారిపోతుందని, బిహేవియర్ కూడా అలాగే ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. బయిల్వాన్ రంగనాథన్ విషయానికి వస్తే.. ఈయన ఒకప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో అడపాదడపా వస్తున్న పాత్రలలో నటిస్తున్నారు.