గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తన నడుము అందాలతో కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేసింది.‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’తో ఇలియానా క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలు ఆమె కెరియర్‌కి శాపంగా మారాయి. బాలీవుడ్‌ని దున్నేయాలని అక్కడికి చెక్కేసిన ఇలియానాకి సరైన సక్సెస్‌లు లేని క్రమంలో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడం, లవ్ ఎఫైర్ వంటి విషయాలు ఆమె కెరీర్ పతనం అయ్యేలా చేసింది.
అయితే ఇలియానా ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుండగా, ఇటీవల తాను ప్రగ్నెంట్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా షాక్ అయ్యారు. అయితే ఇలియానాని ప్రగ్నెంట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ఉంచింది. కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలియజేసింది.
ఇక కొద్ది రోజుల క్రితం ఇలియానాకి కొడుకు పుట్టడంతో ఆ బుడతడితో కలిసి సంతోషంగా గడుపుతుంది. తాజాగా ఇలియానా తన ముద్దుల కొడుకు తో ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేయగా, బుడ్డోడిని చూసి ప్రతి ఒక్కరు భలే ముద్దుగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఆగస్ట్ 1న ఇలియానాకి కొడుకు పుట్టగా, ఇప్పుడు ఆ బుడతడికి రెండు నెలలు పూర్తైన సందర్భంగా రీసెంట్ పిక్ షేర్ చేసింది ఇలియానా. తల్లి కొడుకు ఇద్దరు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇలియానా మాదిరిగానే ఆ బుడతడు ఉన్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇలియానా అప్పట్లో ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్‌తో కొంత కాలం డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా వారి మధుర క్షణాల్నీ కెమెరాలో బంధించి.. ఆ ఫోటోల్నీ ఇలియానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఉండేది. కొద్ది రోజులకి ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు.