Site icon vidhaatha

పాలకూర సూప్‌తో బోలెడు ప్రయోజనాలు.. ఇలా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Palak Soup | చల్లని వాతావరణంలో పాలకూర తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే చలికాలంలో పాలకూర పరాటాలు చేసుకొని తింటే రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాగే పాలకూరతో సూప్ చేసుకొని తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఈ ఆకుకూరలో ఐరన్, ప్రొటీన్, మినరల్స్ ఉంటాయి. ఈ క్రమంలో పాలకూర సూప్ తాగడం ద్వారా చర్మం, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలుంటాయి. చలికాలంలో రోజూ పాలకూర సూప్ తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

పాలకూర సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు

సూప్‌ ఇలా తయారు చేసుకోవాలి

పాలకూర సూప్ చేయడానికి, ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలకూర, ఉల్లిపాయలు, అల్లం, టొమాటో తరుగు వాటన్నింటినీ కొద్దిగా నీటిని పోసుకొని ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీరుపోసుకొని వడగట్టుకోవాలి. చివరగా పాన్ లోకి సూప్ పోసి నల్ల ఉప్పు, నల్ల మిరియాలు వేసి మరిగించాలి. తర్వాత వేడివేడిగా ఉన్న సూప్‌ తాగేయాలి.

Exit mobile version