IND Vs NZ | చెలరేగిన భారత బౌలర్లు..! 66 పరుగులకే కుప్పకూలిన కివీస్‌..! టీ20 సిరీస్‌ మనదే..

IND Vs NZ T20 | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో 168 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్నది. కేవలం 13 ఓవర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన మిచెల్‌ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. 66 ప‌రుగుల‌తో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్‌ జట్టులో మిచెల్ (35) టాప్ స్కోర‌ర్‌ నిలిచాడు. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని […]

  • Publish Date - February 2, 2023 / 12:52 AM IST

IND Vs NZ T20 | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో 168 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్నది. కేవలం 13 ఓవర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన మిచెల్‌ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. 66 ప‌రుగుల‌తో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్‌ జట్టులో మిచెల్ (35) టాప్ స్కోర‌ర్‌ నిలిచాడు. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్​కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

పేసర్లు హార్దిక్​ (4/16), అర్షదీప్‌ సింగ్‌ (2/16), శివమ్‌ మావీ (2/12), ఉమ్రాన్‌ మాలిక్‌ (2/9) చెలరేగడంతో 12.1 ఓవర్లలో 66 పరుగులకే కివీస్‌ జట్టు కుప్పకూలింది. డారిల్‌ మిచెల్‌ (35), మిచెల్‌ సాంట్నర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 126*; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ తోడవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. రాహుల్‌ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు.

భారత బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ (1) ఒక్కడే నిరాశపరిచాడు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్‌, టిక్నర్‌, సోధీ, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన కివీస్‌.. వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ కోల్పోయింది. పర్యటనలో కివీస్‌.. భారత్​ చేతిలో వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో ఓడిపోయింది. కాగా, టీమ్​ఇండియా తర్వాత .. ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ నెల 9 నుంచి సిరీస్‌ కానున్నది.

Latest News