IND vs PAK: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ సారి మనదేశంలోనే వరల్డ్ కప్ సిరీస్ జరగనుడడంతో 2011 హిస్టరీ తిరగరాస్తారని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 2019 ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనుండగా, టీమిండియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది.పాకిస్తాన్‌తో మాత్రం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఇక్కడ మరో విశేషమేమంటే టీమిండియా అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో మ్యాచ్‌లు ఆడనుంది. 2003 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన బారత జట్టు ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ న్యూజిలాండ్ చేతుల్లోనే ఓడిన విషయం తెలిసిందే. ఇక 2021 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇండియాపై కివీస్ విజయం సాధించింది. అందుకోసం భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌పై కూడా అందరి దృష్టి ఉంది. ఈసారి ఎలా అయిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు చూస్తుండగా, ఈ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారనుంది.
భారత్ ఎలాగైన సెమీస్ చేరుతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఒకవేళ భారత్ సెమీస్ చేరిన పక్షంలో తొలి సెమీస్ ముంబైలోను, రెండో సెమీస్ కోల్‌కతాలో జరగనుంది. అదే పాకిస్తాన్ కనుక సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తే మాత్రం ముంబైలో సెమీస్ జరగదు, ఆ మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది. అందుకు కారణం పాక్ మ్యాచ్ మహారాష్ట్రలో జరిగితే అవాంచనీయ సంఘటనలు జరుగుతాయని పాక్ సెక్యూరిటీ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మహారాష్ట్రలోని ముంబై, ఫూణే నగరాలతో పాటు లక్నో, ధర్మశాల, ఢిల్లీ వంటి నగరాల్లో మ్యాచులు ఆడడం లేదు.