Indian Railway | రూ.20, రూ.50కే ఇండియన్‌ రైల్వే ‘ఎకానమీ మీల్స్‌’.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు స్టేషన్లలో అందుబాటులోకి..!

Indian Railway | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే భోజనాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నాలుగు స్టేషన్లలో ప్రయాణికులకు తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నది. తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని ‘ఎకానమీ మీల్స్‌’ పేరుతో అందిస్తున్నది. ఇందులో రెండు రకాల భోజనాన్ని ప్రయాణికులకు సరఫరా చేస్తున్నది. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రకాల భోజనంలో […]

  • Publish Date - July 22, 2023 / 03:49 AM IST

Indian Railway | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే భోజనాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నాలుగు స్టేషన్లలో ప్రయాణికులకు తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నది. తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని ‘ఎకానమీ మీల్స్‌’ పేరుతో అందిస్తున్నది. ఇందులో రెండు రకాల భోజనాన్ని ప్రయాణికులకు సరఫరా చేస్తున్నది.

జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రకాల భోజనంలో ఒకటి రూ.20, మరొకటి కాంబో మీల్స్‌ రూ.50 మాత్రమే. ఈ ఆహారానికి హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే రూ.100 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘ఎకానమీ మీల్స్‌’ను హైదరాబాద్‌, విజయవాత, గుంతకల్‌, రేణిగుంట రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే అందిస్తున్నది.

ఆయా స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. త్వరలోనే అన్ని స్టేషన్లకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ నిర్వహించే జన్‌ ఆహార్‌ ఫుడ్‌ ఔట్‌లెట్స్‌, రిఫ్రెష్‌మెంట్‌ రూమ్స్‌లో ‘ఎకానమీ మీల్స్‌’ను కొనుగోలు చేయవచ్చు. స్టేషన్లలోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై సైతం భోజనం దొరుకుతుంది. అయితే, వీటిని ఎక్కువగా జనరల్‌ బోగీలకు సమీపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

గుర్తింపు పొందిన వెండర్స్‌ మాత్రమే విక్రయించనున్నారు. భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరిలో ఏడు పూరీలతో ఆలు కూర, పచ్చడిని కలిపి రూ.20 అందిస్తున్నారు. రెండో కేటగిరిలో అన్నం, రాజ్‌మా, ఛోలే, కిచిడీ కుల్చే, భటురే, పావ్‌భాజీ, మసాలా దోషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.

దీని ధర రూ.50 ఉంటుంది. 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్‌ వాటర్‌ గ్లాస్‌లు సైతం ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. రూర్కీ, జార్సుగుడ, ఖుర్దా రోడ్డు స్టేషన్లలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి. మారుతూ వస్తున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు భారతీయ రైల్వే చర్యలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగా ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వేస్టేషన్లలో అమ్ముతున్న భోజనం ప్యాకెట్లు ధర ఎక్కువగా ఉండడంతో పాటు నాణ్యతలో లోపాల కారణంగా ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Latest News