Site icon vidhaatha

ద‌స‌రా నుండి పెద్ద సినిమాల సంద‌డి.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే..!

ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంద‌ర్భాలు త‌క్కువ‌. చిన్న సినిమాలు మాత్ర‌మే తెగ సంద‌డి చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూసే ప్రేక్ష‌కుల‌కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.



ద‌స‌రా నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు పెద్ద హీరోలు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచ‌బోతున్నారు. ఇప్పుడిప్పుడే ప‌లువురు హీరోలు త‌మ సినిమా రిలీజ్ డేట్స్ ని ప్ర‌క‌టిస్తూ త‌మ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఈ ద‌స‌రాకి భగవంత్ కేసరి సినిమా విడుద‌ల కానుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌, శ్రీలీల,కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతోంది.


డైరెక్టర్ లోకేష్ కనకరాజు, విజయ్ దళపతి నటించిన లియో సినిమా కూడా అక్టోబర్ 19నే రిలీజ్ కానుంది. ఇక శాండిల్ వుడ్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా చిత్రం కూడా ఆ రెండు సినిమాల‌కి పోటీగా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. ఇక మాస్ మ‌హ‌రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయ‌బోతున్నారు.



ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక టైగర్ ష్రాఫ్, కృతి సనన్ కలిసిన గణపత్ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయ‌నున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్న పొలిమేర-2 సినిమా నవంబర్ 2వ తేదీన రిలీజ్ కానుంది.


మెగా హీరో వైష్ణవ తేజ్, అందాల భామ శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 10వ తేదీన విడుదల చేయ‌నున్నారు… కార్తీ నటించిన జపాన్ సినిమా నవంబర్ 10వ తేదీన రిలీజ్‌కి సిద్ధంగా ఉండ‌గా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం నవంబర్ 17వ తేదీన రిలీజ్ కానుంది.



అలాగే గం గం గణేష్ సినిమా నవంబర్ 17న విడుదల కానుండ‌గా, ప్ర‌భాస్ న‌టించిన భారీ చిత్రం సలార్ సినిమా డిసెంబర్ 22న విడుద‌ల చేయ‌నున్నారు. అదే రోజునే షారుక్ ఖాన్ నటించిన డంకి సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీటితో పాటు మ‌రి కొన్ని చిత్రాలు కూడా త్వ‌ర‌లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయ‌నున్నారు. ఈ ఏడాది చివర‌లో మంచి సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Exit mobile version