Site icon vidhaatha

ఏక్ నిరంజ‌న్ సెట్‌లో ప్ర‌భాస్, నేను ఆ పని చేశాం: కంగనా షాకింగ్ కామెంట్స్

ఏక్ నిరంజ‌న్ సెట్‌లో ప్ర‌భాస్, నేను ఆ పని చేశామంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనాఏక్ నిరంజ‌న్ సెట్‌లో ప్ర‌భాస్, నేను ఆ పని చేశామంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉండే కంగ‌నా ఏ విష‌యాన్నైన నిర్మొహ‌మాటంగా చెబుతుంది. మ‌న‌సులో ఏది అనుకుందో అది ఓపెన్‌గా చెప్ప‌డం ఆమె నైజం. కంగ‌నా త‌న కెరియ‌ర్ లో ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి ప్రేక్ష‌కుల‌ని అలరించింది.

కెరీర్ ప్రారంభంలో ఎక్కువ‌గా సౌత్ సినిమాలు చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్ర‌భాస్ తో క‌లిసి ఏక్ నిరంజ‌న్ అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌గా, మూవీ 2009లో విడుద‌లైంది.ఈ సినిమాతో కంగనా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాగా, ఈ మూవీ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో చేసింది లేదు.

ఏక్ నిరంజ‌న్ చిత్రం ఫ్లాప్ అయిన కూడా తన‌కు ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో మంచి మెమోరీస్ ఉన్నాయ‌ని అంటుంది కంగ‌నా ర‌నౌత్. `ఏక్‌ నిరంజన్‌` సినిమా షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్ నేను చాలా స‌ర‌దాగా ఉన్నామ‌ని పేర్కొంది. అప్పుడు మేము ఇద్ద‌రం యంగ్ ఏజ్‌లో ఉండ‌డం వ‌ల్ల చాలా అల్ల‌రి అల్ల‌రి చేశామ‌ని, సెట్‌లో చిల్ అయ్యామ‌ని పేర్కొంది.

అంతేకాదు సెట్‌లో టీజింగ్ కూడా చేసుకునే వాళ్ల‌మంటూ పేర్కొంది. ప్ర‌భాస్ ఇప్పుడు చాలా మారిపోయారు. ఆయ‌న గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగారు, చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొంది కంగ‌నా. ఇప్పుడు `ఏక్‌ నిరంజన్‌ 2` సినిమా చేస్తే.. అందులో మీరు నటించడానికి సిద్ధమేనా అని కంగనాని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి సిద్ధంగానే ఉన్న‌ట్టు చెప్పింది.

తాను సౌత్‌లో కూడా సినిమాలు చేయ‌డానికి సిద్ధం, మంచి క‌థ‌లు వ‌స్తే ఎక్క‌డైన న‌టిస్తానంటూ కంగ‌నా ర‌నౌత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఇప్పుడు `చంద్రముఖి 2`లో నటిస్తున్న ఈ భామ తానే అడిగి సినిమాలో న‌టించిన‌ట్టు పేర్కొంది. పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా నటిస్తున్న `చంద్రముఖి 2` చిత్రాన్ని లైకా పిక్చర్స్ నిర్మిస్తుండ‌గా, ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రమోషనల్‌ ప్రెస్‌ మీట్‌ని నిర్వహించ‌గా, కంగనా రనౌత్ కార్య‌క్ర‌మంలో పాల్గొంది.. ఈ నేప‌థ్యంలో ప్రభాస్‌తో వర్క్ గురించి ఓపెన్‌ అయ్యింది.

Exit mobile version