సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి అనే సినిమా తెరకెక్కగా,ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి ఆఫర్స్ క్యూ కట్టాయి. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ… మంచి క్రేజ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.
హీరోయిన్‌గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో కూడా కీర్తి సందడి చేస్తుంది. చివరగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించగా, ఈ సినిమా కీర్తికి దారుణమైన పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి ఓ బాలీవుడ్ చిత్రం చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్, వరుణ్ ధావన్ ఆటో రైడ్‌కి వెళ్లగా, ఆ సమయంలో వరుణ్ షర్ట్ వేసుకోకుండా బనియన్ మీదే ఉన్నారు. ఇది రియల్ లైఫ్‌లోనా, రీల్ లైఫ్‌లోనా అనేది ఎవరికి అర్ధం కాదు.