వామ్మో.. బికినీలో కేతిక సాహసం.. కేక పెట్టించే అందాలతో బ్రో బ్యూటీ రచ్చటాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూరీ తనయుడు సినిమాతో కేతిక టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో తెగ బేజారవుతోంది.
ఇక అది అలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని కుదురుగా ఉండనివ్వదు. తాజాగా విదేశీ టూర్ చెక్కేసిన ఈ భామ బికినీలో రచ్చ చేసింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ వాటర్ లో స్విమ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుంత కేతికకి సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఇక కేతిక విషయానికి వస్తే ఈ అమ్మడు లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న బ్రో.. ది అవతార్‌లో నటించింది. ఈ సినిమా జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమాకి ముందు అందాల ముద్దుగుమ్మకి ఒక్క మంచి హిట్ పడలేదు.. కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు అని చెప్పాలి. ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించిన ఈ భామ ఆ సినిమాతో కూడా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది.
నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్యలో కూడా కేతిక నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ మధ్య సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. విలువిద్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుందని భావించారు. కాని సినిమాలో సరైనా కథ లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది .
దీంతో ఈ ముద్దుగుమ్మ ఫ్లాప్ చవి చూసింది. ఇక ఇక ఈ భామ నటించిన మరో సినిమా రంగ రంగ వైభవంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో కేతికకి నిరాశే ఎదురైంది.వరుస ఫ్లాపులు వస్తున్నా కూడా కేతికకి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ మూవీతో తెలుగు సినిమాలకు పరిచయం అయిన విషయం తెలిసిందే.ఇందులో తన అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది.