Kiara Advani | మహేశ్‌బాబు హీరోయిన్‌ జోరు మామూలుగా లేదుగా..! భారీగా పెంచేసిన కియారా అద్వానీ..!

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది సామెత. ఈ సామెతను బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ బాగా వంటపట్టించుకున్నది. చేతినిండా పలు చిత్రాలతో ఈ బ్యూటీ ఫుల్‌ బిజీగా ఉన్నది

  • Publish Date - March 5, 2024 / 05:28 AM IST

Kiara Advani | దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది సామెత. ఈ సామెతను బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ బాగా వంటపట్టించుకున్నది. చేతినిండా పలు చిత్రాలతో ఈ బ్యూటీ ఫుల్‌ బిజీగా ఉన్నది. పెళ్లి తర్వాత కియారా జోరు పెంచింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే, బాలీవుడ్‌లో వార్‌-2 చిత్రంలోనూ కనిపించనున్నది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.


బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ డాన్‌-3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డాన్‌ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించనుండగా.. హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ను తీసుకున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైంది. డాన్ సిరీస్‌లో వచ్చిన తొలి రెండు చిత్రాల్లో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించాడు. ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ హీరోయిన్లుగా నటించారు. డాన్‌-3 చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన కియారా భారీగా రెమ్యునరేషన్‌ అందుకోనున్నట్లు టాక్‌. దాదాపు రూ.13కోట్ల వరకు ఈ సినిమా ఫీజు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.


దాంతో బాలీవుడ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో దీపిక పదుకొనె, అలియా భట్, జాన్వీ కపూర్‌ ఉండగా.. తాజాగా కియారా పేరు సైతం చేరింది. కియారా తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌లో సైతం రామ్‌ చరణ్‌కు జోడీగా నటించనున్నది. వార్‌-2 చిత్రంలో హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుండగా.. ఈ చిత్రానికి కూడా భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని టాక్‌.

Latest News