Site icon vidhaatha

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

విధాత: పాములు నేల‌పై వ‌డివ‌డిగా దూసుకెళ్తాయి. కానీ గోడ‌ల‌పైకి పాములు ఎక్క‌లేవు. నున్న‌గా ఉండే ప్రాంతాల్లో పాములు పైకి పాక‌లేవు. గ‌రుకుగా ఉండే ప్ర‌దేశంలో అయితే వేగంగా ముందుకు వెళ్తాయి. అలా ఓ పాము గోడ‌పై పాకేందుకు త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించింది. ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

అరిజోనాలోని కోరోనాడో నేష‌న‌ల్ మెమోరియ‌ల్ పార్కులో సోనోర‌న్ మౌంటెన్ కింగ్ స్నేక్.. గోడ‌పై పాకిన తీరు అద్భుతం. త‌న‌కున్న నైపుణ్యాన్ని ప్ర‌యోగించింది. ఇటుక‌ల గోడ‌ల‌పై పైకి ఎక్కేందుకు ఇబ్బంది ప‌డింది.

అయిన‌ప్ప‌టికీ.. ఆ ఇటుక‌ల మ‌ధ్య ఉండే ప్లేస్ ఆధారంగా పైకి ఎక్కి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ వీడియోను నేష‌న‌ల్ పార్క్ సిబ్బంది ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను నోకియా ఫోన్‌లోని స్నేక్ గేమ్‌తో నెటిజ‌న్లు పోల్చుతున్నారు.

Exit mobile version