ఉల్టా పుల్టా అంటూ నాగార్జున హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 7 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌తో షో మొదలు కాగా, తొలి వారం కిరణ్ రాథోడ్ బయటకు వచ్చింది. ఈ అమ్మడు తెలుగులో నువ్వులేక నేను లేను, జెమినీ, కెవ్వు కేక, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించి అలరించింది. వెండితెరపై బోల్డ్‌గా కనిపించి సందడి చేసిన కిరణ్ తాజాగా తనకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చి షాకిచ్చింది. ముంబైకి అవకాశాల కోసం వెళ్ళినప్పుడు దారుణమైన వ్యక్తులని కలిశానని, వారు తనని చాలా ఇబ్బంది పెట్టారని కిరణ్ రాథోడ్ పేర్కొంది.
ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్న సమయంలో కిరణ్ రాథోడ్ కూడా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశం ఇస్తామని పిలిచేవారని, కాంట్రాక్టు మీద సంతకం పెట్టిన తర్వాత వారి అసలే విశ్వరూపం బయటపడేదని కిరణ్ స్పష్టం చేసింది. ఎప్పుడైతే మనం సంతకం పెడతామో వెంటనే రాత్రికి వచ్చేయ్ అంటూ చాలా అసభ్యంగా మాట్లాడేవారని కిరణ్ పేర్కొంది. అయితే వారు అలా మాట్లాడిన సందర్భంలో నా దగ్గర ఎలాంటి సినిమాలు లేకపోయిన కూడా వారి మాటలకి చిరాకు వచ్చి ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చే దానిని అంటూ కిరణ్ రాథోడ్ స్పష్టం చేసింది.
కాంప్రమైజ్ కావడం కన్నా ఏదైన సైడ్ బిజినెస్ చేసుకుంటే బెటర్ అని ఆ సమయంలో అనిపించేదని ఈ బోల్డ్ బ్యూటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అయితే తనకు కాస్టింగ్ కౌచ్ సమస్యలు లేవని, అవకాశాలు మాత్రం వస్తున్నాయంటూ పేర్కొంది. ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన ముద్దుగుమ్మ తన జీవితంలో రెండు సార్లు లవ్ బ్రేకప్ జరిగినట్టు తెలియజేసింది. గతంలో ఓ వ్యక్తితో నాలుగేళ్లు సహజీవనం చేశాను. కానీ అతడి సరైన వ్యక్తి కాదని తెలిసి బ్రేకప్ చెప్పాను. అతడిని పెళ్లి చేసుకొని ఉంటే నన్ను చంపి ఉండేవాడని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక ఆ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించగా అతను నమ్మించి మోసం చేశాడు. దీంతో ఏడేళ్ల నుండి సింగిల్‌గా ఉంటున్నాని తెలియజేసింది. పెళ్లి చేసుకొనే ఉద్దేశం తనకు లేదని కిరణ్ తెలియజేసింది.