Samantha: కర్మ అనేది ఏదో రోజు మన జీవితంలోకి తిరిగి వస్తుందంటారు. మనం చేసే పనులు, మాట్లాడే మాటలు కూడా ఏదో ఒక రోజు మనకే తగులుతాయి. తాజాగా సమంత విషయంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 2013లో సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు తిరిగి ఆమెకే గుచ్చుకుంది. వివరాలలోకి వెళితే మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్‌లో 1 నేనొక్కడినే చిత్రం రూపొందగా, ఇందులో కృతి సనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులని నిరాశపరచిన కూడా సాంగ్స్ మాత్రం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలోని ‘హలో రాక్ స్టార్’ సాంగ్ లో మహేష్ అడుగు జాడలను హీరోయిన్ కృతి సనన్ చేతులతో తాకుతూ ఉన్నట్టుగా షాట్ ఒకటి ఉంటుంది.
దీనికి సంబంధించి పోస్టర్స్ విడుదల అయిన సమయంలో సమంత అసహనం వ్యక్తం చేస్తూ ఓ కామెంట్ పెట్టింది. అప్పటికి సమంత ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లే అయిన మహేష్ బాబు లాంటి హీరో సినిమా పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.
మగాళ్లకు ఆడవాళ్లు బానిసలు అన్నట్లు ఆ పోస్టర్ ఉందని కొంత అసహనం వ్యక్తం చేసింది.. స్త్రీ పురుషులు సమానమే అయితన హీరోయిన్ హీరో కాళ్ళను తాకుతున్నట్లు చూపించడమేంటని కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సమంత కామెంట్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ఆమెని తెగ ట్రోల్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ అనే సినిమా చేస్తుంది. రీసెంట్‌గా ఈ మూవీ నుండి ఆరాధ్య అనే సాంగ్ విడుదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది. అంతేకాదు విజయ్ దేవరకొండ కాలు ఆమె చేతిని తాకుతుంది కూడా. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ పాత సంఘటనని జ్ఞప్తికి తెస్తూ సమంతపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు నీ మనోభావాలు ఏమయ్యామమ్మా..ఇది అమ్మాయిలని కించపరచడం కాదా అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సమంత ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక ఖుషీ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కగా, మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.