King Cobra | విధాత: నాగుపాము పేరు వినగానే శరీరంలో వణుకు పుడుతోంది. ఇక ఆ పాము మన కంటికి కనబడిందంటే చాలు పరుగులు పెడుతాం. ఆ పాము విష పూరితమైనది కూడా. అలాంటి నాగుపాముకే ఓ వ్యక్తి ముద్దు పెట్టాడు.
ఆ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉంది. నాలుగు అడుగుల మేర పడగ విప్పింది. కోరలను బయటకు చాచుతూ బుసలు కొడుతోంది. పడగను అలానే విప్పి ఉంచింది. దీంతో ఆ పడగపై ముద్దు ఇచ్చేందుకు స్నేక్ క్యాచర్ ప్రయత్నించాడు. మెల్లిగా దాని వద్దకు వెళ్లి సున్నితంగా పడగపై ముద్దు పెట్టాడు. ఆ పాము కూడా ఆ వ్యక్తికి ఎలాంటి హానీ కలిగించలేదు. కానీ చూస్తున్న వారికి మాత్రం ఆందోళన కలగక తప్పదు.
నాగుపాముకు ముద్దిచ్చిన వ్యక్తి ఇప్పటి వరకు 38 వేల పాములను పట్టాడు. 3000 పాము కాట్లకు గురయ్యాడు. కానీ అతనికి పాము కాటుకు వైద్యం ఎలా చేయాలో తెలియడంతో.. ప్రాణాలతో బయట పడ్డాడు.
పాముకు ముద్దిచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం దీన్ని సౌరభ్ జాదవ్ అనే వ్యక్తి తన ఇన్ స్టాలో పోస్టు చేయగా.. 13 వేల మంది వీక్షించారు.