Site icon vidhaatha

Viral News | ఇది భావోద్వేగ స‌న్నివేశం.. విదేశాల్లో ఉన్న కూతురికి తండ్రి స‌ర్‌ప్రైజ్..

Viral News | కూతురు అంటే ప్ర‌తి తండ్రి ఎంతో ఇష్ట‌ప‌డుతాడు. కుమార్తె ఒక్క క్ష‌ణం క‌నిపించ‌క‌పోయినా తండ్రి త‌ల్లడిల్లిపోతాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ ఆడ‌బిడ్డ‌.. తండ్రికి ఒక్క క్ష‌ణం దూరంగా ఉన్న‌.. ఆ బాధ వ‌ర్ణాతీతం. అలాంటి సన్నివేశ‌మే ఇది.

ఉన్న‌త చ‌దువుల‌క‌ని ఓ తండ్రి త‌న కుమార్తెను ఏడాదిన్న‌ర క్రితం విదేశాల‌కు పంపాడు. ప‌దేప‌దే బిడ్డ గుర్తుకు రావ‌డంతో.. ఆమెకు చెప్ప‌కుండానే.. ఆమె ప‌ని చేస్తున్న చోటుకు వెళ్లి కూతురికి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు తండ్రి. తండ్రిని చూసిన కూతురు ఆశ్చ‌ర్య‌పోయి ఆనంద భాష్పాలు రాల్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. భార‌త్‌కు చెందిన శ్రుత్వా దేశాయి గ్రాడ్యుయేష‌న్ కోసం కెన‌డా వెళ్లింది. ఏడాదిన్న‌ర క్రితం కెన‌డా వెళ్లిన శ్రుత్వా అక్క‌డ ఓ షాపులో ప‌ని చేసుకుంటూ, చ‌దువుకుంటుంది. అయితే శ్రుత్వా అంటే తండ్రికి ఎంతో ఇష్టం. ఆమె ప‌దేప‌దే గుర్తుకు వ‌స్తుంది. ఆమెను విడిచి తండ్రి ఉండ‌లేక‌పోతున్నాడు. ఏడాదిన్న‌ర పాటు ఆ బాధ‌ను దిగ‌మింగుకున్నాడు.