Site icon vidhaatha

Manchu Lakshmi | కెమెరాకి అడ్డొచ్చాడ‌ని.. వ్య‌క్తిని లాగి కొట్టిన మంచు ల‌క్ష్మీ: వీడియో వైర‌ల్

Manchu Lakshmi

తెలుగు రాష్ట్రాల‌లో మంచు ల‌క్ష్మీ గురించి తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. మోహ‌న్ బాబు త‌న‌య‌గా ల‌క్ష్మీకి మంచి గుర్తింపు ఉంది. ఒక‌ప్పుడు తెగ స‌త్తా చాటిన మంచు ల‌క్ష్మీ ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరస్‌లు చేస్తూ.. కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం తెగ సంద‌డి చేస్తుంటుంది.

సోషల్‌ మీడియాలో ఆమె చేసే పోస్టులన్ని నిమిషాల వ్యవధిలో వైరలవతుండ‌డ‌మే కాకుండా అదే స్థాయిలో తెగ ట్రోలింగ్ కూడా అవుతుంటాయి. అయితే మంచు లక్ష్మి మాత్రం ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోదు. ఎవరు ఏమనుకున్నా సరే.. తన దారిలోనే వెళుతూ త‌న ప‌ని తాను చేసుకుంటుంది. అయితే ఈ అమ్మ‌డికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో మంచు ల‌క్ష్మీ ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు . దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మంచు లక్ష్మీ సందడి చేయ‌గా, మీడియా మాట్లాడుతూ ఉండగా.. ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. అడ్డు వచ్చిన ఆ వ్యక్తి మీద ఓ దెబ్బ వేసిన మంచు ల‌క్ష్మీ.. నీ.. అంటూ ఏదో అనబోయింది. సదరు యాంకర్ ఆ వీడియోను తీసేయండి, కట్ చేయండని అంటే.. వద్దు ఉంచండి అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

ఇంతలో మరో వ్యక్తి అడ్డు రాబోయాడు. ఏయ్.. డుర్‌ర్‌ర్ అంటూ పక్కకు జరుగు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ ఇందులో కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మంచు ల‌క్ష్మీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మంచు లక్ష్మీది దురుసు చర్య అని కొంద‌రు అంటుండ‌గా, ఇంకొంత మంది మాత్రం మంచు లక్ష్మీ ఫన్నీ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ త్వ‌ర‌లో బీజేపీలో చేర‌నుంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లో పొలిటికల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఉంటుందో అని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక అట్ట‌హాసంగా జరిగింది.

ఈ వేడుకలు ఆహ్వానం అందుకున్న మంచు లక్ష్మి వేదికపై తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసి అంద‌రిని ఆక‌ట్టుకుంది.ఇప్పుడు ఈ అమ్మ‌డు జయాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. అలానే ప‌లు షోలు చేస్తుంది.

Exit mobile version