న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జిపై ఓ యువకుడు భయంకరమైన స్టంట్లకు పాల్పడ్డాడు. వేగంగా దూసుకెళ్తున్న ఓ ఆటోలో యువకుడు బయటి వైపు నిలబడి హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి బలంగా తగిలాడు. దీంతో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుకాల వస్తున్న బైక్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో సైక్లిస్ట్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగలేదు.