Marnus Labuschagne
ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెటర్స్‌లో మేటి ఆటగాడు మార్నస్ లబుషేన్.. ఈయన ప్రపంచ క్రికెట్‌లోను మేటి బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడు. అయితే క్రికెట్ పరంగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ చరిత్రలో నిలిచి పోతున్న లబుషేన్ ఒక్కోసారి విచిత్రమైన పనులు చేస్తూ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా, మనోడు కుర్చీలో కూర్చొని కునుకు తీసాడు. మరోవైపు ఆటగాళ్లని రెచ్చగొడుతూ కవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు.
ఇలా వెరైటీ క్యారెక్టర్‌తోను హాట్ టాపిక్‌గా నిలుస్తున్న లబుషేన్ యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్ లో నోట్లో నుంచి కింద పడిన బబుల్ గమ్‌ని తిరిగి నోట్లో వేసుకున్నాడు. అతను చేసిన ఈ తుంటరి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో లబుషేన్ మొట్టమొదటిసారిగా గోల్డెన్ డకౌట్ అయిన ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని కూడా కోల్పోవలసి వచ్చింది. ఇక రెండో టెస్టులో 93 బంతులు ఆడిన లబుషేన్ 7 ఫోర్లతో 47 పరుగులు చేసి ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 45వ ఓవర్లో లబుషేన్ తన గ్లవ్స్‌ను సరిచేసుకుంటూ ఉండగా.. అతని నోట్లో ఉన్న బబుల్ గమ్ జారి కింద పడిపోయింది. మిగతా ఆటగాళ్లు అయితే దానిని అలా వదిలివేయ డమో, లేదంటే పక్కకి పడేయడమో చేస్తుంటారు. కాని లబుషేన్ కాస్త వెరైటీ కదా, కింద పడిన చూయింగ్ గమ్‌ను తీసుకొని నోట్లో వేసుకొని బ్యాటింగ్ చేశాడు.
లబుషేన్‌కి సంబంధించిన ఈ సన్నివేశం కెమెరాలలో రికార్డ్ కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గతంలోను లబుషేన్ ఇలాంటి తింగరి పనులు ఎన్నో చేసి వార్తలలోకి ఎక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్ట్‌లో మంచి విజయం సాధించిన ఆసీస్ రెండో టెస్ట్‌లోను పట్టు సాధిస్తుంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 రన్స్‌కు ఆలౌట్ కాగా, ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ లో స్టీవ్ స్మిత్ (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 325 రన్స్‌కే పరిమితమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది.
Gum incident pic.twitter.com/XKgEkBzr6t
— stu media acct (@stuwhymedia) June 29, 2023