Site icon vidhaatha

Veera Simha Reddy | ‘వీరసింహారెడ్డి’ సుగుణ సుందరి పాటకి డ్యాన్స్ ఇరగదీసిన మెగా కోడలు.. వీడియో

విధాత‌, సినిమా: ‘వీరసింహారెడ్డి (Veerasimha Reddy)’ చిత్రంలో ‘సుగుణ సుందరి.. సుగుణ సుందరి.. చూపుల రాజకుమారి’ అంటూ సాగే పాటలో బాలయ్య (Balayya), శృతిహాసన్ (Shruti Haasan) ఆడి పాడారు.

క్లాస్ గెటప్స్‌తో ఊర మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. అదిరిపోయే రేంజ్‌లో ఈ చిత్రంలోని ఆ పాట అంద‌రినీ మెప్పించింది. ఇప్పుడీ పాటకు మెగా కోడలు (Mega daughter-in-law) డ్యాన్స్ చేశారు. మెగా కోడలు అనగానే ఎవరో అని ఊహించేసుకుంటున్నారేమో.. మీరనుకుంటున్న ఆమె అయితే కాదు కానీ.. ఈమె కూడా మెగా కోడలే. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషయంలోకి వస్తే.. మెగా ఫ్యామిలీకి దూరపు బంధువైన కొణిదెల పవన్ తేజ్ (Konidela Pawan Tej) ప్రేక్షకులకు పరిచయమే. హీరోగా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాలలో కూడా ఆయన నటించారు. గత ఏడాది ఆగస్ట్‌లో పాపులర్ యాంకర్ మేఘన (Meghna)తో పవన్ నిశ్చితార్థం జరిగింది.

అటు సినిమాలలో అలాగే టీవీ షోలు, డిజిట‌ల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మేఘన.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని సుగుణ సుందరి సుగుణ సుందరి (Suguna Sundari Suguna Sundari) సాంగ్‌కి సింపుల్‌గా స్టైలిష్ అండ్ మాస్ మూమెంట్స్ వేసి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇప్పుడీ వీడియోకి మెగా కోడలు కుమ్మేసింది.. నైస్ డాన్స్… హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. జై బాలయ్య.. శృతిహాసన్ అంటూ మేఘన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది.

Exit mobile version