Site icon vidhaatha

బాక్సాఫీస్‌ వద్ద మెగాస్టార్‌ Vs సూపర్‌స్టార్‌..! ఒకే తేదీన రెండు సినిమాలు..!

Chiranjeevi Vs Mahesh Babu | వరుస చిత్రాలతో మెగాస్టార్‌ చిరంజీవి బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన వాల్తేర్‌ వీరయ్య బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం మెగాస్టార్‌ హీరోగా ‘భోళాశంకర్‌’ సినిమా తెరకెక్కెతున్నది. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఉగాది సందర్భంగా అభిమానులకు సినిమా విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌.

ఆగస్ట్‌ 11న భోళా శంకర్‌ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపారు. దాంతో అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. అదే సమయంలో స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాను సైతం ఆగస్ట్‌ 11న రిలీల్‌ చేయాలని నిర్ణయించారు. రెండు నెలల కిందటే నిర్మాణ నాగవంశీ ఈ విషయాన్ని ప్రకటించారు. మహేశ్ పుట్టిన రోజు ఆగస్ట్‌ 9న కాగా.. 11 సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో మహేశ్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. అదే రోజున మెగాస్టార్‌ సినిమాను సైతం రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.

ఒకేసారి ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలు విడుదల చేస్త.. ఏదో ఒక సినిమా నష్టాలు తప్పవని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి అయితే ముందుకైనా, లేదా కాస్త ఆలస్యంగానైనా విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భోళా శంకర్‌ చిత్రం షూటింగ్‌ కొనసాగుతున్నది. త్రివిక్రమ్, మహేశ్‌బాబు సినిమా షూటింగ్ మాత్రం కాస్త వెనుకపడింది. మరి ఆగస్ట్‌ వరకు ఏ సినిమా విడుదలకు సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version