Site icon vidhaatha

రానా భార్య కూడా రెచ్చ‌గొడుతుందిగా.. క్యూట్ అందాల‌కి తెర‌లేపింది..!

ఒక‌ప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే సోష‌ల్ మీడియాలో అందాల‌కి తెర‌లేపేవారు. కాని ఇప్పుడు అలా కాదు. హీరోల భార్య‌లు సైతం కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల హృద‌యాల‌ని గ‌ల్లంతు చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌, రానా భార్య మిహికాలు అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో చేస్తూ కేక పెట్టిస్తున్నారు. రానా భార్య తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో సెగలు రేపుతూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. హీరోయిన్‌ల‌ని మించి మిహికా బ‌జాజ్ ఉంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మిహికా క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మూడేళ్ల ముందు మిహీకా బజాజ్ ని రాని పెళ్లి చేసుకోగా, గ‌త కొద్దిరోజులుగా మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు తెగ వస్తున్నాయి. అయితే ఓ సందర్భంలో మిహీకా నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ రానా చెప్ప‌డంతో నిజంగానే మిహికా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని అంద‌రు భావించారు. కాని దానిపై స్పందించిన మిహికా.. సర్‌ప్రైజింగ్ న్యూస్ వస్తుందని రానా ఎందుకు చెప్పారో తెలియ‌దు. పెళ్లి త‌ర్వాత నాకు కాస్త ఒళ్లు రావ‌డం వ‌ల‌న అలా క‌నిపిస్తున్నాను త‌ప్ప ప్రెగ్నెంట్ కాదు. నేను నిజంగా ప్ర‌గ్నెంట్ అయితే అంద‌రికి త‌ప్ప‌క తెలియ‌జేస్తాన‌ని ఓ సంద‌ర్భంలో మిహికా స్ప‌ష్టం చేసింది.

రానా తన ప్రేయసి, మిహికా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం జ‌రుపుకోగా, ఆగస్టు 8న వివాహం సింపుల్‌గా చేసుకున్నారు. కొద్ది రోజుల వైవాహిక జీవితం త‌ర్వాత వీరిద్దరూ విడిపోతారని ప్రచారం కూడా సాగింది. సమంత, చైతూ కపుల్స్ మాదిరిగానే రానా, మిహికా కపుల్ విడాకులు తీసుకుంటున్నారని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌గా, వాటికి ఈ ఇద్ద‌రు పులిస్టాప్ పెట్టారు.

ఇక రానా కెరీర్ విష‌యానికి వ‌స్తే..లీడర్ గా సినీ కెరీర్ మొదలు పెట్టిన దగ్గుబాటి రానా.. తర్వాత వెంటనే దమ్ మారో దమ్ అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. అనంతరం తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం వంటి చిత్రాలతో అల‌రించాడు. ప‌లు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌తో సైతం మెప్పించాడు. 

Exit mobile version