Mohan Babu | మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి అడ్డంగా దొరికిన‌ మంచు ఫ్యామిలీ.. మోహ‌న్ బాబుని ఆడేసుకుంటున్నారుగా..!

Mohan Babu | మంచు ఫ్యామిలీ అంటే ట్రోల‌ర్స్ వాళ్లలో దాగి ఉన్న కొత్త క్రియేటివిటీని బ‌య‌ట‌కు తీసి ట్రోల్స్ చేస్తుంటారు. మంచు మోహ‌న్ బాబు నుండి విష్ణు, మంచు ల‌క్ష్మీ, మ‌నోజ్‌ల‌ని తెగ ఆడేసుకుంటారు. కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ దారుణ‌మైన ట్రోలింగ్ బారిన ప‌డుతుంది. వారు ఏం మాట్లాడిన‌, ఏం చేసిన కూడా ట్రోల‌ర్స్ వారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో మంచు ఫ్యామిలీనే వారికి స్ట‌ఫ్ ఇస్తూ ట్రోలింగ్ బారిన ప‌డుతుంది. […]

  • Publish Date - August 23, 2023 / 10:33 AM IST

Mohan Babu | మంచు ఫ్యామిలీ అంటే ట్రోల‌ర్స్ వాళ్లలో దాగి ఉన్న కొత్త క్రియేటివిటీని బ‌య‌ట‌కు తీసి ట్రోల్స్ చేస్తుంటారు. మంచు మోహ‌న్ బాబు నుండి విష్ణు, మంచు ల‌క్ష్మీ, మ‌నోజ్‌ల‌ని తెగ ఆడేసుకుంటారు. కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ దారుణ‌మైన ట్రోలింగ్ బారిన ప‌డుతుంది.

వారు ఏం మాట్లాడిన‌, ఏం చేసిన కూడా ట్రోల‌ర్స్ వారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో మంచు ఫ్యామిలీనే వారికి స్ట‌ఫ్ ఇస్తూ ట్రోలింగ్ బారిన ప‌డుతుంది. తాజాగా మోహ‌న్ బాబు ట్రోల‌ర్స్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో ఆయ‌న‌ని తెగ ఆడేసుకుంటున్నారు.

విద్యానికేతన్‌లో తెలుగు భాషాదినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాల‌ని భావించిన మంచు ఫ్యామిలీ ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఫోటోతో కలిపి తెలుగు భాషా దినోత్సవం సెలెబ్రేషన్స్ అని రాసి ఓ హోర్డింగ్ పెట్టారు.

అయితే తెలుగు భాషా దినోత్స‌వం అని చెప్పి తెలుగులో రాయ‌కుండా ఇంగ్లీష్‌లో రాయ‌డంతో ట్రోల‌ర్స్ ఆ హోర్డింగ్‌ని అడ్డం పెట్టుకొని తెగ ట్రోల్ చేస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవం అని చెప్పి.. అంతా ఇంగ్లీష్ లోనే రాసార క‌ద‌య్యా? ఇదెక్కడి కామెడీ అంటూ కొంద‌రు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ మధ్యన విడుదలైన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ ఇలా చాలా అంశాల‌లో మంచు ఫ్యామిలీ ట్రోలింగ్ బారిన ప‌డింది. అయితే విష్ణు ఈ మ‌ధ్య ట్రోలింగ్‌పై సీరియ‌స్ అయ్యారు. ఇక మోహ‌న్ బాబు కూడా సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్లలో ట్రోలింగ్‌పై మాట్లాడారు.

త‌న ఫ్రెండ్స్ కొంద‌రు వీడియోలు పంపిస్తుంటార‌ని, అవి చూసి నాకు చాలా బాధ‌గా ఉంటుంద‌ని తెలియ‌ జేశారు. ట్రోల్స్‌ అంటే అంద‌రిని నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదని ఆయ‌న తెలియ‌జేశారు. త‌న‌ని ట్రోల్స్ చేయించే హీరోలు ఎవ‌రో త‌న‌కు తెలుస‌ని చెప్పిన మోహ‌న్ బాబు.. వారు కూడా ఏదో ఒక రోజు ఈ స‌మ‌స్య ఎదుర్కొంటార‌ని చెప్పారు.

Latest News