Site icon vidhaatha

వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా

విధాత : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్‌రెడ్డికి పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, వెంటనే ఆమోదించాలని కోరుతున్నానన్నారు. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని, నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు

Exit mobile version