Site icon vidhaatha

సీతారామం హీరోయిన్‌కి రే చీక‌టా.. పెద్ద షాకే ఇచ్చిందిగా..!

దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం సీతారామం. ఇందులో క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం తెలుగు, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ దుమ్ము రేపుతుంది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ని ఎంపిక చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తున్న సీతారామం బ్యూటీ బాలీవుడ్‌లో సైతం అద‌ర‌గొడుతుంది.

ప్ర‌స్తుతం నేచురల్ స్టార్ నానీ జతగా.. హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ ముద్దుగుమ్మ ఎంత ర‌చ్చ చేస్తుంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఎప్ప‌టిక‌ప్పుడు వెరైటీ దుస్తుల‌లో కనిపిస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

మృణాల్ ఠాకూర్ రేచీకటితో బాధపడుతుండ‌గా, ఆ విషయాన్ని దాచేసి.. పెళ్ళి కోసం వరుడిని వెతికేపనిలో ఉన్నారంట మృణాల్ కుటుంబసభ్యులు. అస‌లు ఆమెకి రే చీక‌టి ఉండ‌డం ఏంటి, అది దాచి అప్పుడే ఆమెకి పెళ్లి చేయ‌డ‌మేంట‌ని కొంద‌రు నోరెళ్ల‌పెడ‌తారు. అయితే ఇక్క‌డ కొంత ట్విస్ట్ ఉండ‌గ‌గా, ఆ ట్విస్ట్ ఏంటో తాజాగా చెప్పుకొచ్చింది మృణాల్

ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌లో ఆంఖ్‌ మిచోలీ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో మృణాల్‌కి రేచీకటి. ఆ విషయాన్ని దాచి వరుడుకోసం వెతుకుతుంటారట‌ ఆమె కుటుంబసభ్యులు. అయితే మృణాల్‌కి రే చీక‌టి సినిమాలో అని నిజ జీవితంలో కాద‌ని తెలిసి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రేచీక‌టి పాత్ర చేయ‌డం తొలిసారి అని, ఈ తరహా పాత్ర చేయడం ఓ ఛాలెంజ్‌ లాంటిదని మృణాల్ అంటుంది.

ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం వల్ల.. ఆమె ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ వస్తుండడం మ‌నం చూస్తున్నాం. అయితే సినిమాల్లో సరే, నిజంగా మీ పెళ్లెప్పుడు? అని ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందిస్తూ.. పెళ్లి గురించి నా కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగానే ఉంది. కాకపోతే నన్ను భరించేవాడు అసలు ఉన్నాడా అనేది నా డౌట్ అని చెబుతూ న‌వ్వేసింది.

Exit mobile version