నల్గొండ: ప్రేమ జంట ఆత్మహత్య.. అనుమానాలు

<p>విధాత: నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ నేరేడుగొమ్ము మండలం కాసరాజు పల్లి అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. యువతీ యువకులు ఇద్దరు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువకుడు దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన రాకేష్, ధోనియాల గ్రామానికి చెందిన గుర్రం కృష్ణయ్య, జయమ్మ ల కూతురు దేవి గత కొంత కాలంగా ప్రేమించుకుంటుండగా విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో […]</p>

విధాత: నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ నేరేడుగొమ్ము మండలం కాసరాజు పల్లి అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. యువతీ యువకులు ఇద్దరు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

యువకుడు దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన రాకేష్, ధోనియాల గ్రామానికి చెందిన గుర్రం కృష్ణయ్య, జయమ్మ ల కూతురు దేవి గత కొంత కాలంగా ప్రేమించుకుంటుండగా విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

ఘటనా స్థలంలో పరుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అందరూ అనుకున్నారు. కానీ మృతుల శరీరాలపై గాయాలు ఉండటంతో.. ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.