Niharika: మెగా డాటర్ నిహారిక విడాకులకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా వాటిపై మౌనంగా ఉంటూ వచ్చింది. ఆ మధ్య డెడ్ పిక్సెల్స్ ప్రమోషన్స్ లో అడిగిన నిహారిక స్పందించింది లేదు. అయితే ఎట్టకేలకు తన సోషల్ మీడియా ద్వారా విడాకులపై తొలిసారిగా స్పందించింది నిహారిక. తాను, చైతన్య పరస్ప అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమయం మా ఇద్దరికి కూడా చాలా కీలకమని చెప్పిన నిహారికా దయచేసి ఎవరు కూడా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది. తాము కొత్త జీవితాలని ప్రారంభించబోతున్నట్టు తెలియజేసిన నిహారిక.. వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ ఇవ్వాలని కోరింది.
కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేసింది నిహారిక. కాగా, కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్య చేసిన దరఖాస్తు బయటకు రావడంతో నిహారిక తప్పక స్పందించాల్సి వచ్చింది. నెల క్రితమే ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని , అయితే ఆలస్యంగా డివోర్స్ పిటిషన్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు నిహారిక తన సోషల్ మీడియా ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం నిహారిక భర్త చైతన్య.. తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో జనాలకు డౌట్ వచ్చింది. అప్పటి నుండి నిహారిక విడాకులకి సంబంధించి పలు ప్రచారాలు జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు స్పందించలేదు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో నిహారిక సోలోగా కనిపించడంతో ఆమె విడాకుల విషయం నిజమేనని అందరు డిసైడ్ అయ్యారు. ఇక తాజా ప్రకటనతో పూర్తి క్లారిటీ వచ్చింది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు మానేసి కేవలం నిర్మాణం పైనే దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడైతే తన భర్త నుండి దూరంగా వచ్చేసిందో ఇక అప్పటి నుండి నిహారిక నటించడంతో పాటు నిర్మాణంతోను బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది.