Niharika |
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. నాగబాబు కుమార్తెగా, వరుణ్ తేజ్ చెల్లెలుగా ముందు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత చిన్న చిన్న వెబ్ సిరీస్ లు చేసి ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా మారింది.
సినిమాలు ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. దాంతో జొన్నలగడ్డ చైతన్యని నిహారికకి ఇచ్చి పెళ్లి జరిపించారు నాగబాబు. రెండేళ్ల పాటు కూడా సజావుగా వీరి సంసారం సాగలేదు. కొద్ది రోజుల క్రితం నిహారిక, చైతన్యలు తమ విడాకులని అఫీషియల్‌గా ప్రకటించారు. విడాకుల తర్వాత నిహారిక దేశాలు తెగ ఎంజాయ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.
అయితే నిహారికకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నవంబర్‌లో వరుణ్ తేజ్ వివాహం జరగనుండగా, ఆయన పెళ్లితో పాటు నిహారిక పెళ్లి కూడా జరిపించాలని నాగబాబు అనుకుంటు న్నాడట. మెగా బ్రదర్ నాగబాబుకి తన ఇద్దరు పిల్లలంటే చాలా ఇష్టం. ఇద్దరిని చాలా అన్యోన్యంగా చూసుకున్నాడు. అయితే నిహారికకి పరిస్థితి ఇలాంటి పరిస్థితి రావడంతో నాగబాబు చాలా మదన పడుతున్నాడు.
తన కూతురిని మంచి ఇంటికి వచ్చి ఆమెకి మంచి లైఫ్ ఇవ్వాలని నాగబాబు అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక పెళ్లి కూడా జరిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తమ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని చూశారని, ఆ అబ్బాయితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు వినికిడి.
ఇక కొద్ది రోజుల క్రితం నిహారిక ఓ యూట్యూబర్‌తో రిలేషన్ కొనసాగిస్తుందని ప్రచారం జరిగింది. నిఖిల్ విజయేంద్ర సింహాకి నిహారికకు ఏదో ఉందంటూ గత కొంత కాలంగా వార్తలు రాగా, నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఓ క్లారిటీ వచ్చింది. నిహారిక తన పోస్ట్‌లో నా చిట్టి తమ్ముడు అని అతడిని సంభోదిస్తూ ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ నిహారికపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకి చెక్ పడేలా చేసింది.