Site icon vidhaatha

ప్రేమికుల దినోత్స‌వం.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఆవు.. వీడియో

విధాత: ప్రేమికుల దినోత్స‌వానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఆ రోజున ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ వ‌స్తుంటాయి. అంతేకాదు ఆ ప్ర‌పోజ‌ల్స్‌ను సున్నితంగా తిర‌స్క‌రించే వారు కూడా ఉంటారు. ఒక వేళ అప్ప‌టికే ప్రేమ‌లో ప‌డి ఉంటే.. ప్రేమ‌కు గుర్తుగా ఉండే విలువైన కానుక‌లు ఇస్తుంటారు. వినూత్నంగా, ఊహించ‌ని విధంగా స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూ మ‌న‌సును దోచుకుంటారు. ఇది ల‌వ‌ర్స్ డే ప్ర‌త్యేక‌త‌.

అయితే ప్రేమికుల దినోత్స‌వం రోజున ఓ ఆవు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆ ఆవుపై ల‌వ‌ర్స్‌ను ప్ర‌తిబింబించేలా ఆర్ట్ వేశారు. ఆవు ముందు కాళ్ల‌పై నుంచి ఎద భాగం వ‌ర‌కు అమ్మాయిని పోలిన దృశ్యం, వెనుక కాళ్ల‌పై అబ్బాయిని పోలిన చిత్రాన్ని పెయింటింగ్ వేశారు. ఇక అమ్మాయి ముందుకు న‌డ‌క సాగిస్తుంటే.. ఆమె వెనుకాలే యువ‌కుడు ఫాలో అవుతున్న‌ట్లు, ఓ పూల బోకేతో త‌న ప్రేమ‌ను వ్య‌క్తప‌రుస్తున్న‌ట్లు ఆవుపై చిత్రీక‌రించారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ఆవును ఓ వ్య‌క్తి తీసుకెళ్తున్న‌ట్లు వీడియోలో ఉంది. ప్రేమికులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రేమంటే ఇదేరా.. నిన్నే ప్రేమిస్తా అంటూ ల‌వ‌ర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version