Site icon vidhaatha

Pooja Hegde: అవ‌కాశాలు రావ‌డం లేద‌ని పూజా హెగ్డే అలాంటి నిర్ణ‌యం తీసుకుందా..మంచి జరుగుతుందా మ‌రి..!

Pooja Hegde: టాలీవుడ్‌ బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా పడిపోయింది. వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజా హెగ్డేకి ఇప్పుడు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. దీంతో నెమ్మదిగా తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది పూజా హెగ్డే. లక్కీ హీరోయిన్‌ నుంచి, ఐరన్‌ లెగ్ హీరోయిన్‌గా మారి న పూజా హెగ్డే ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర‌స‌న గుంటూరు కారం అనే సినిమా చేస్తుంది. అయితే ఈ సినిమా నుండి పూజాని త‌ప్పించిన‌ట్టు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. పూజా ప‌రిస్థితి ఇప్పుడు మ‌రింత దారుణంగా మారింది. అవ‌కాశాలు లేక వ‌చ్చిన అవ‌కాశాలు జార‌విడుస్తుండ‌డంతో పూజా హెగ్డే అయోమ‌యంలో ప‌డింద‌ట‌.

ప్ర‌స్తుతం పూజా హెగ్డేని దుర‌దృష్టం వెంటాడుతుండగా, ప్ర‌స్తుతం చాలా మానసిక సంఘర్షణకు గురి అవుతుంది.. దీంతో ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.. కెరీర్ లో మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలని అనుకుంటున్న ఈ అమ్మ‌డు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని కలిసి పూజలు చేయించు కోవాలని భావిస్తుంద‌ట‌. ఆ మ‌ధ్య ర‌ష్మిక మందాన‌.. వేణుస్వామితో పూజలు చేయించుకోగా, ఆ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్‌, డింపుల్ హ‌య‌తి కూడా పూజ‌లు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే ఇప్పుడు పూజా హెగ్డే కూడా తన సినీ కెరీర్ కోసం పూజా హెగ్డే వేణు స్వామితో పూజలు చేయించు కోవాలని అనుకుంటుందని సన్నిహితులు అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం త‌న కెరీర్‌ గ్రాఫ్‌ని నిలబెట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉంద‌ట‌. రవితేజతో ఓ సినిమా చేసే అవ‌కాశం పూజాకి వ‌చ్చింద‌ని, గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స్ అనుకున్నార‌ట‌. సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ నటించే సినిమాలోనూ పూజా హెగ్డే ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్‌- హరీష్‌ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రంలో కూడా పూజా హెగ్డేని క‌థానాయిక‌గా అనుకున్న‌రు. అయితే ఈ సినిమా షూటింగ్ నత్త‌న‌డ‌క‌న సాగుతుంది. అలానే తేజ్ చిత్ర షూటింగ్ కి చాలా స‌మ‌యం ప‌ట్టేలా కనిపిస్తుంది. ఈ క్ర‌మంలో పూజా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది.

Exit mobile version