Prabhas: సినీ నటులు దేవుళ్లుగా కనిపించి ప్రేక్షకులని అలరించడం కొన్ని దశాబ్ధాలుగా వస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి వారు పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో సుమన్ దేవుడిగా కనిపించడాన్ని అభిమానులు జీర్ణించుకున్నారు. రాముడిగా, కృష్ణుడిగా ఆయనకు నూటికి నూరు శాతం మార్కులు వేశారు. ఇక గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడిగా కనిపించి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అయితే అందించారు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రాజెక్ట్ కెలో మోడ్రన్ కృష్ణుడిగా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మళ్లీ ప్రభాస్ దేవుడిగా కనిపిస్తాడని తెలిసి ఫ్యాన్స్ ఉలిక్కిపడుతున్నారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో ఆయన రాముడిగా కనిపించిన విషయం తెలిసిందే. మోడ్రన్ రాముడిగా ప్రభాస్ కూడా కొంత విమర్శల పాలయ్యాడు. ఓం రౌత్ రామాయణం అంటూ ఆదిపురుష్ సినిమాని ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. ఆదిపురుష్ చిత్రం దేవుడు సెంటిమెంట్స్ నేపథ్యంలో రూపొంది వ్యతిరేకతకు గురైంది. ఇప్పటికీ ఆదిపురుష్‌పై కస్సుబుస్సుమంటూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ మోడ్రన్ శ్రీకృష్ణుడుగా కనిపించనున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ మోడ్రన్ రాముడిగా కనిపించాడు. కాని ప్రాజెక్ట్ కెలో ఆయన మోడ్రన్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉండదని కొందరు అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి ఇందులో శ్రీకృష్ణుడు ప్రస్తావన మాత్రమే ఉంటుంది. ప్రభాస్ నేరుగా శ్రీకృష్ణుడు పాత్ర చేసే అవకాశం లేదు కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తే అవకాశం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. వైజయంతి బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది ప్రాజెక్ట్ కె. ఇందులో ప్రభాస్ సరసన దీపికా కథానాయికగా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని కూడా ఓ పాత్రలో మెరవనుంది.