చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 7 షో 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది . ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ కంటెస్టెంట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించి గేమ్ ఆడిస్తుండడం చూస్తతూనే ఉన్నాం. తాజా ఎపిసోడ్‌లో రెండు గేమ్స్ జరగగా, అంఉలో ఆటగాళ్లు విజయం సాధించారు.
ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్..కెప్టెన్సీ విధులు తెలుసుకోవాలని.. ఈ సారి సీరియస్ గా ఉండాలని చెప్పి తిరిగి కెప్టెన్ బ్యాడ్జ్ ప్రశాంత్‌కి అందిస్తాడు. దీంతో పల్లవి ప్రశాంత్ మరో సారి ఎమోషనల్ అవుతూ.. బిగ్ బాస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తారు. అనంతరం హౌస్ లో ఎవరు స్మార్ట్ అంటూ ఆటగాళ్లు, పోటుగాళ్ళు మధ్య బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు బిగ్ బాస్.
అయితే అంతకముందు హౌస్‌లో ఉన్న శోభ తన మేకప్ కిట్‌ను .. పోటుగాళ్ల నుంచి దొంగతనం చేసే సమయంలో దొంగ దొంగ అంటూ వాయిస్ వస్తుంది. అప్పుడు మేకప్ కిట్ ఇప్పించండి బిగ్ బాస్ అంటూ వేడుకుంటుంది. కాని అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో నయన నుంచి కొద్దిగా హైలైనర్‌ను తీసుకుని రాసుకుంటుంది.
శోభ పనికి సీరియస్ అయిన బిగ్ బాస్ .. హెడ్ ఆఫ్ లగేజ్ అయిన అర్జున్, అశ్విని పై సీరియస్ అవుతాడు. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలంటూ హెచ్చరిస్తాడు. అంతేకాదు తప్పు చేసిన శోభకి పనిష్మెంట్ ఇవ్వాలని కూడా చెబుతాడు. ఈ క్రమంలో అర్జున్..తేజ మూడు రోజుల నుండి వేసుకున్న కారణంగా ఉప్పు పట్టి మాసిన టీ షెర్ట్‌ను ధరించాలని చెబుతాడు. ఆ శిక్షను ఏం మాట్లాడకుండా శోభ యాక్సెప్ట్ చేస్తుంది.
ఇక టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు రెండు టీమ్స్ నుంచి ఒక్కక్కరు వచ్చి సమాధానం చెప్పాలి. బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కార్డులపై ఉన్న బొమ్మల్లో ఉంటుంది. అయితే ఎవరైతే సరైన బొమ్మని తీసుకుని బోర్డుపై ముందుగా పెడతారో వాళ్ళకి పాయింట్ లభిస్తుంది. ముందుగా బిగ్ బాస్ అఖండ చిత్రంలో బాలయ్య డైలాగ్ వినిపించి, అందులో బాలయ్య ఆయుధం ఏంటి అని అడిగారు.
ఆటగాళ్లు సరైన సమాధానం ఇస్తారు. అనంతరం బాహుబలి, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఖుషి చిత్రాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. అయితే ఈ టాస్క్‌లో ఆటగాళ్లు టీం సరైన సమాధానాలు చెప్పడంతో విజయం సాధించారు. అనంతరం ఎవరు ఫోకస్డ్ అనే టాస్క్ నిర్వహించగా, ఈ టాస్క్ లో గాల్లోకి బెలూన్ ని పంపి దానిని కింద పడకుండా ఎగరేస్తూ తమకి కేటాయించిన రంగుల బంతులని బాస్కెట్ లో నింపాల్సి ఉంటుంది..
ఈ టాస్క్ లో కూడా ఆటగాళ్లు టీం విజయం సాధించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. మొత్తానికి ఫైనల్ పట్టికలో.. చెరి మూడు పాయింట్లతో.. ఆటగాళ్లు.. పోటుగాళ్లు సమానంగా నిలుస్తారు. మరి ఇందులో విజేతని బిగ్ బాస్ ఎలా తేలుస్తారో చూడాలి.