Site icon vidhaatha

కళాతపస్వి కే విశ్వనాథ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని

PM Modi | ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమన్న ప్రధాని.. సినీ ప్రపంచంలో ఆయన ఓ దిగ్గజమని చెప్పారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని, ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘కే విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. సినీ ప్రపంచంలో ఆయన ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

Exit mobile version