Site icon vidhaatha

మన గొంతు మనం కోసుకున్నట్టే.. బండ్ల గ‌ణేశ్ ట్వీట్ వైరల్

Bandla Ganesh | సినీ నిర్మాత‌, రాజ‌కీయ నాయ‌కులు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న‌కు న‌చ్చిన ప్ర‌తి ట్వీట్‌పై ఆయ‌న స్పందిస్తుంటారు. ఎలాంటి మొహ‌మాటం లేకుండా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అలా అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో హైలెట్ అవుతుంటారు బండ్ల గ‌ణేశ్‌. కొన్ని వివాదాస్ప‌ద ట్వీట్లు చేసి వార్త‌ల్లో కూడా నిలుస్తుంటారు. తాజాగా గ‌ణేశ్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

జీవితం చాలా చిన్న‌ది.. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు, ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌కు కొన‌సాగింపుగా మ‌రో ట్వీట్ చేశారు. ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే
కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మీ అందరికి చెబుతున్నా.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఎవరినైనా నమ్మామా.. మన గొంతు మనం కోసుకున్నట్టే.. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి అని గ‌ణేశ్ పేర్కొన్నారు. మీ శక్తితో మీరు పోరాడండి. ఎంత పెద్దోడైన గౌరవించండి కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి అని బండ్ల గ‌ణేశ్ పేర్కొన్నారు.

Exit mobile version