Site icon vidhaatha

Manchu Vishnu-Manoj | మంచు విష్ణు – మనోజ్‌ గొడవపై చిట్టిబాబు కీలక వ్యాఖ్యలు..!

Manchu Vishnu-Manoj | అన్నాదమ్ముల గొడవ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియోతో ఇద్దరి మధ్య విభేదాలున్నట్లు తేలిపోయింది. విష్ణు మనోజ్ మధ్య గొడవలకు ఆస్తులే కారణమని ప్రచారం జరుగుతున్నది.

ఈ క్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. సారథి అనే వ్యక్తి మంచు ఫ్యామిలీలో పని చేసే వ్యక్తి అని, వాళ్లకు కజిన్ అని చిన్న వివాదంతో గొడవ జరిగిందని పేర్కొన్నారు. ఓ వివాదానికి సంబంధించి సారథి సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతోనే గొడవ పెద్దదయిందన్నారు.

నాలుగు గోడల మధ్య జరగాల్సిన దాన్ని.. మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో సమస్య మరింత ముదిరిందని చిట్టిబాబు పేర్కొన్నారు. తాను క్యాజువల్‌గా వీడియో పెట్టానని మనోజ్ చెప్పాడని చిట్టిబాబు తెలిపారు. ఆస్తుల గొడవలు ఉండవని, ఇప్పటికే పంపకాలు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు.

భూమా మౌనికను మనోజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని.. వాళ్లకు ఇష్టం ఉంటే ఇతరులకు సమస్య ఏంటని ప్రశ్నించిన ఆయన.. సమస్య ఉన్నా ఎలాంటి విలువ ఉండదని తెలిపారు. హడావిడి లేకుండా పెళ్లి చేయాలని అలా చేశారని తెలిపారు.

మనోజ్ పెళ్లిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన.. విష్ణు – సారథి గొడవ పొలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ వ్యవహరాలను సారథి చూసుకున్నారని వివరించారు.

Exit mobile version