Putin | పుతిన్‌కు అరెస్ట్ భయం!! బ్రిక్స్ సదస్సుకు డుమ్మా??

Putin విధాత‌: అమెరికాకు అన్ని విధాలుగా పోటీగా నిలిచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా ? అమెరికాను ఎదిరించే స్థాయి ఉన్న రష్యా దేశపు అధ్యక్షుడు ఇప్పుడు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారా..అందుకే ఇపుడు రష్యా దేశాన్ని వీడి వేరే దేశానికి వెళ్ళడానికి భయపడుతున్నారా ? అందుకే వచ్చేనెల జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ : బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ల కూటమి సదస్సుకు ఎగ్గొడుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఆగస్ట్ […]

  • Publish Date - July 20, 2023 / 04:19 PM IST

Putin

విధాత‌: అమెరికాకు అన్ని విధాలుగా పోటీగా నిలిచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా ? అమెరికాను ఎదిరించే స్థాయి ఉన్న రష్యా దేశపు అధ్యక్షుడు ఇప్పుడు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారా..అందుకే ఇపుడు రష్యా దేశాన్ని వీడి వేరే దేశానికి వెళ్ళడానికి భయపడుతున్నారా ? అందుకే వచ్చేనెల జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ : బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ల కూటమి సదస్సుకు ఎగ్గొడుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఆగస్ట్ 22,23,24 తేదీల్లో దక్షిణాఫ్రికా లోని జోహన్స్ బర్గ్ లో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ రావడం లేదని అంటున్నారు.

ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి , ఆదేశాన్ని దాదాపు నాశనం చేసేసాడు పుతిన్. యుద్ధం ఆపాలని అమెరికా, బ్రిట‌న్‌, భార‌త్ వంటి అగ్ర‌దేశాలు పలుమార్లు కోరినా పుతిన్ వినలేదు. ఉక్రెయిన్ మీద బాంబుల వాన కురిపిస్తునే ఉన్నాడు. అవసరం అయితే అణుబాంబులు సైతం ప్రయోగిస్తాను అని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించాడు.

ఇక ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం చేస్తున్న‌ కారణంగా మాన‌వ హ‌న‌నానికి సంబంధించి ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. పుతిన్‌ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేసే ఆలోచనలు ఉన్నట్లు రష్యన్ గూఢచార వర్గాలు గుర్తించాయి. దీంతో త‌న‌ను అరెస్టు చేస్తారేమోన‌నే భ‌యంతో పుతిన్ దేశ స‌రిహ‌ద్దులు దాట‌డం లేద‌ని బీబీసీ చెబుతోంది.

మొత్తానికి యూరోప్ మొత్తాన్ని వణికించిన పుతిన్ ఇప్పుడు అరెస్టుకు, తరువాత జరిగే విచారణకు భయపడుతున్నారు అని అందుకే బ్రిక్స్ సదస్సుకు రావడం లేదని అంటున్నారు. ఈ సదస్సుకు ఆయా దేశాధినేతలు లేదా ప్రభుత్వ అధినేతలు హాజరు అవుతారు.

Latest News