Nepal’s Presidential election । నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రాంచంద్ర పౌడెల్‌

విధాత : నేపాల్‌ మూడవ అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంచంద్ర పౌడెల్‌ (Ram Chandra Paudel) ఎన్నికయ్యారు. ఆయనకు పార్లమెంటులో 214 ఓట్లు, ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల్లో 352 ఓట్లు లభించినట్టు అధికారులు ప్రకటించారు. నేపాలీ కాంగ్రెస్‌ (Nepali Congress), సీపీఎన్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) (CPN- Maoist Center) ఉమ్మడి అభ్యర్థి పౌడెల్‌. పౌడెల్‌ ఎన్నికపై నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా (Sher Bahadur Deuba) హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు […]

  • Publish Date - March 9, 2023 / 01:19 PM IST

విధాత : నేపాల్‌ మూడవ అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంచంద్ర పౌడెల్‌ (Ram Chandra Paudel) ఎన్నికయ్యారు. ఆయనకు పార్లమెంటులో 214 ఓట్లు, ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల్లో 352 ఓట్లు లభించినట్టు అధికారులు ప్రకటించారు. నేపాలీ కాంగ్రెస్‌ (Nepali Congress), సీపీఎన్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) (CPN- Maoist Center) ఉమ్మడి అభ్యర్థి పౌడెల్‌. పౌడెల్‌ ఎన్నికపై నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా (Sher Bahadur Deuba) హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో 882 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పార్లమెంటు సభ్యులు 332, ఏడు ప్రావిన్స్‌లకు చెందిన ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ సభ్యులు 550 మంది ఉన్నారు. వీరిలో 518 మంది ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ సభ్యులు, 313 మంది ఫెడరల్‌ పార్లమెంటు సభ్యులు ఓటు వేశారు. నేపాల్‌ 2008లో గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత ఇది మూడవ అధ్యక్ష ఎన్నిక. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎవరీ రాంచంద్ర పౌడెల్‌?

నేపాలీ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న రాంచంద్ర పౌడెల్‌.. ఆ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు. ప్రముఖ రచయిత. అనేక సాహితీ అవార్డులు కూడా ఆయన అందుకున్నారు. నేపాల్‌ పార్లమెంటు ప్రతినిధుల సభ (House of Representatives)కు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. పలు దఫాలు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. గతంలో నేపాల్‌ ఉప ప్రధానిగా, హోమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో కఠ్మాండులోని త్రిభువన్‌ యూనివర్సిటీలో ఎంఏ పట్టా పొందిన పౌడెల్‌.. అజ్ఞాతంలో ఉంటూ పరీక్షలకు హాజరయ్యారు.

Latest News