ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తుంది. స్పోర్ట్స్ పర్సనాలిటీకి సంబంధించిన బయోపిక్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో క్రికెటర్స్ బయోపిక్స్ రూపొందుతూనే ఉన్నాయి. ధోని బయోపిక్‌కి మంచి సక్సెస్ రావడంతో విరాట్ కోహ్లీ బయోపిక్ కి సంబంధించి ప్రస్తుతం ప్రణాళికలు నడుస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుందని చర్చలు జరుగుతుండగా, చరణ్ విరాట్ కి దగ్గర పోలికలు ఉంటాయని, బాడీ కూడా అంతే ఫిట్ గా మెయింటైన్ చేస్తాడని, చరణ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని బాలీవుడ్ వాళ్ళు అనుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో విరాట్ కోహ్లీ బయోపిక్ నటిస్తాడని అందరు అనుకుంటున్న సమయంలో హీరో రామ్ ఇప్పుడు కోహ్లీ బయోపిక్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం స్కంద మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ మాట్లాడుతూ.. విరాట్ కి, నాకు దగ్గరి పోలికలు ఉన్నాయని పలువురు తెలియజేశారు. ఒకవేళ విరాట్ బయోపిక్ లో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నాడు. మరి విరాట్ బయోపిక్ ఎప్పుడు వస్తుందో, బయోపిక్ లో ఎవరు నటిస్తారో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు మరి.
ఇక ఇదే ప్రమోషన్‌లో భాగంగా రామ్ మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే తనకు ఇష్టమని చెప్పిన రామ్… ఈతరం హీరోల్లో రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టమని కూడా అన్నారు. ఇక రామ్‌కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ఆయన సక్సెస్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు. స్కంధ చిత్రం మంచి విజయం సాధిస్తుందని రామ్ నమ్ముతున్నాడు.మరి చూడాలి మరి ఏం జరుగుతుందో.