Actress Rambha | ప్రముఖ సినీ నటి రంభకు ప్రమాదం తప్పింది. కెనడాలో తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైంది. దీంతో రంభతో పాటు ఆమె పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. కూతురు సాస మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను రంభ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కూతరు సాస త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని తన అభిమానులను రంభ కోరింది.