Site icon vidhaatha

మ‌రో లేడి కంటెస్టెంట్ ఔట్.. ఊహించ‌ని ఎలిమినేష‌న్‌తో అంద‌రు షాక్

బిగ్ బాస్ సీజ‌న్ 7 రోజు రోజుకి ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సండే వ‌చ్చిందంటే ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే టెన్ష‌న్ అంద‌రిలో ఉంటుంది. అయితే ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రు లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మ‌రి ఈ వారం కూడా మ‌రో లేడి కంటెస్టెంట్ హౌజ్ నుండి వెళ్ల‌డం విశేషం. ఆదివారం ఎపిసోడ్ మొద‌ట్లోనే శివాజీ ర‌చ్చకి తెర‌లేపాడు.




త‌న‌కు వ్య‌తిరేఖంగా ఓట్లు వేసి హౌజ్‌మేట్ అర్హ‌త కోల్పోయేలా చేసిన హౌజ్‌మెంట్స్ తీరుని నాగార్జున ముందు పెట్టాడు. అప్ప‌డు నాగ్… శివాజీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి అభిప్రాయం చెప్పుకొచ్చిన శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ లని ప్రశ్నించారు. యావర్, ప్రశాంత్ విషయంలో శివాజీ పక్షపాత ధోరణితో ఉన్నట్లు మాకు అనిపిస్తుంద‌ని శోభా చెప్పుకు రాగా, అది స‌రైన క్లారిఫికేష‌న్‌గా లేద‌ని నాగార్జున అన్నారు.




ప్రియాంక జైన్ చెప్పిన స‌మాధానం కూడా స‌రిగ్గా లేదు. శివాజీ కంటెస్టెంట్ అర్హత కోల్పోవడానికి సరైన కారణం చెప్ప‌లేదు కాని, హౌస్ మేట్స్ తీసుకున్న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూ శివాజీ ఇప్పుడు నువ్వు హౌజ్‌మేట్ కాన‌ట్టే. తిరిగి మ‌ళ్లీ గేమ్ ఆడాల్సిందే అంటూ నాగ్ చెప్పుకొస్తారు. ఇక శివాజీ ఆ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌ని అంటారు.




ఇక ఆ త‌ర్వాత హౌజ్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడిస్తాడు. సినిమా పేరుని బొమ్మగా గీసి టీమ్ కి హింట్ ఇస్తే, ఆ గ్రూప్ వారు సినిమా ఏంటో గుర్తు పట్టాలి. ఇది చాలా ఫ‌న్‌గా సాగుతూ వ‌చ్చింది. ఇక మ‌ధ్య మధ్యలో ఒక్కొక్క‌రిని సేవ్ చేస్తూ వ‌చ్చిన నాగార్జున చివ‌రిలో ర‌తిక‌, శుభ‌శ్రీ, తేజ ముగ్గురిలో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని చెప్పుకొచ్చారు.




పులి బొమ్మ పట్టుకున్నపుడు పులి సౌండ్ వస్తే సేఫ్. మేక సౌండ్ వస్తే నాట్ సేఫ్ అని నాగార్జున చెప్ప‌గా, ఈ రౌండ్ లో శుభ శ్రీ సేఫ్ అయింది. ఇక మిగిలింది తేజ, రతిక కాగా, ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని అంద‌రిలో టెన్ష‌న్ ఉంది. ఇద్ద‌రికీ రెండు బ్లాస్టింగ్ గన్స్ ఇచ్చి, నాగ్ కౌంట్ డౌన్ మొద‌లు పెట్టారు.




ఎవ‌రి గ‌న్ బ్లాస్ట్ అయితే వారు సేఫ్, బ్లాస్ట్ కాని వారు అన్ సేఫ్ అని చెప్ప‌డంతో కౌంట్ డౌన్ పూర్తి కాగా, తేజ గ‌న్ బ్లాస్ట్ అయింది. దీంతో తేజ సేవ్ అయ్యాడు. ర‌తిక ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే తాను ఎలిమినేట్ అయినందుకు ర‌తిక చాలా ఏడ్చింది.




హౌస్ మేట్స్ ఆమెకి ఎమోషనల్ గా సెండాఫ్ ఇచ్చి ఆ త‌ర్వాత‌.. నాగ్ దగ్గరకి వెళ్లిన తర్వాత కూడా రతిక క‌న్నీరు పెట్టుకుంది. త‌న ఏవీ చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉంది. బిగ్‌బాస్‌ లో ర‌తిక‌ జర్నీ చూస్తే.. వెన్నుపోట్లు.. లవ్ ట్రాక్‌లు తప్పితే పెద్ద‌గా ఆడిన‌ట్టు క‌నిపించ లేదు. ప‌వ‌రాస్త్ర టాస్క్‌ల‌లో కూడా ప్ర‌భావం చూప‌లేదు . ఈ క్ర‌మంలో ఆమె ఎలిమినేట్ అయి హౌజ్ వీడాల్సి వ‌చ్చింది.

Exit mobile version