Site icon vidhaatha

య‌ష్‌పై ర‌వితేజ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ వివాదాలకి దూరంగా ఉంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ర‌వితేజ‌కి ఇటీవ‌ల పెద్ద‌గా హిట్స్ రావ‌డం లేదు. దాంతో ఆయ‌న మంచి హిట్ అందుకోవాల‌ని ఎంతో క‌సిగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే క్రేజీ చిత్రం చేసాడు. ఈ చిత్రం మ‌రి కొద్ది రోజులలో విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ఆయన కేజీఎఫ్ హీరో య‌ష్‌పై చేసిన కామెంట్స్ యష్ అభిమానుల‌ని ఎంత‌గానో హర్ట్ చేశాయి. ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్… ఒక్కో సౌత్ ఇండియా స్టార్ గురించి చెబుతూ వారిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పాల‌ని అన్నారు.

ముందుగా యాంకర్.. రామ్ చరణ్ గురించి అడగ్గా… మంచి డాన్సర్ అని, అత‌ని డాన్స్ అంటే నాకు ఇష్టం అన్నాడు. అనంతరం ప్రభాస్ గురించి అడగ్గా.. అప్పీరెన్స్. చూడ్డానికి డార్లింగ్ చాలా బాగుంటాడు అని చెప్పుకొచ్చాడు. ఇక త‌మిళ స్టార్ హీరో విజయ్ గురించి అడగ్గా… విజయ్ కూడా మంచి డాన్సర్, డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడ‌ని మెచ్చుకున్నారు. మీరు కూడా మంచి డ్యాన్స‌ర్ క‌దా అని యాంక‌ర్ అంటే నాకు డ్యాన్స్ పెద్ద‌గా రాదు, జ‌స్ట్ అలా మేనేజ్ చేస్తాన‌ని అంటాడు. ఇక చివ‌రిగా కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న య‌ష్ గురించి అడ‌గ్గా, దానికి ర‌వితేజ స్పందిస్తూ… ఆయన గురించి నాకు తెలిసింది తక్కువ. యష్ అంటే కెజిఎఫ్. అలాంటి సినిమా రావడం ఆయ‌న‌ అదృష్టం అని రవితేజ అన్నారు.

అంటే కేజీఎఫ్ వ‌ల్ల‌నే య‌ష్‌కి అంత పేరు వచ్చింద‌ని ర‌వితేజ చెప్పిన‌ట్టుగా ఉండ‌డంతో సోషల్ మీడియా వేదికగా రవితేజపై య‌ష్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన నీపై ఇంత‌క‌ముందు కొంచెం గౌరవం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. యష్ విషయంలో నువ్వు ఇగో బయటపెట్టావు. యష్ కేవలం కెజిఎఫ్ వ‌ల్ల‌నే స్టార్ కాలేదు. గ‌తంలో మంచి హిట్స్ అందించాడు. కేజీఎఫ్ హిట్ కావ‌డంతో య‌ష్ ప్రమేయం చాలా ఉంది. స్క్రిప్ట్, డైలాగ్స్ విషయంలో య‌ష్ చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వు కనీసం కెజిఎఫ్ సౌత్ రికార్డు కొట్టి చూపించు అంటూ రవితేజకు సవాల్ విసురుతున్నారు కొందరు అభిమానులు. టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ ముందు ర‌వితేజ ఇలాంటి వివాదంలో చిక్కుకోవ‌డం యూనిట్‌కి ఇబ్బందిని క‌లిగిస్తుంది. కాగా టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల చేయ‌నున్నారు.

Exit mobile version