Site icon vidhaatha

రవితేజ ‘టైగర్’కు గుడ్‌బై చెప్పిన రేణు దేశాయ్‌..!

విధాత‌, సినిమా: రేణు దేశాయ్.. మన తెలుగు హీరోయిన్ కాకపోయినా ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. చివరిసారిగా పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో ఆయనే నటించిన జానీ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె వెండితెర‌పై క‌నిపించ‌లేదు.

పిల్లలు, వారి పెంపకం కోసం గృహిణిగా ఉండిపోయింది. తర్వాత పవన్‌తో విడాకుల తర్వాత పిల్లల బాధ్యతలను పూర్తిగా తీసుకుంది. ఆ మధ్య ఓ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ చేయాలని భావించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఒకటి రెండు మరాఠీ చిత్రాలను నిర్మించింది. అవి బాగానే ఆడాయి.

ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం వంశీకృష్ణ దర్శకత్వంలో ఒకనాటి స్టువ‌ర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తోంది. ఇందులో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కు రేణు దేశాయ్‌ గుడ్‌బై చెప్పింది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమ‌ల‌తా ల‌వ‌ణం అనే ఓ సామాజిక కార్యకర్త పాత్రలో నటిస్తోంది. హేమ‌ల‌తా లవణం అంటే నాటి క‌వి గుర్రం జాషువ కుమార్తె. గోప‌రాజు ల‌వ‌ణంగా ఆమెకి సామాజిక కార్య‌క‌ర్త‌గా మంచి పేరుంది. డాక్ట‌ర్ సమరం సోదరుడి భార్య అనమాట.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన రేణు దేశాయ్ పార్ట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా అమె భావోద్వేగానికి గురైంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆమె డైరెక్టర్ వంశీకృష్ణకు థాంక్స్ చెప్పింది. అభిషేక్ అగర్వాల్ వారి వల్లే ఈ యూనిట్ అంతా తనకు ఫ్యామిలీగా మారిందని ఆమె తెలిపింది. ఎంతో కంఫర్ట్ గా పనిచేశానని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ జరిగే ప్రతిక్షణం ఎంజాయ్ చేశానని వెల్లడించింది.

ఇక ఈమె అభిమానులతో పంచుకున్న పోస్టులలో ఎక్కడా రవితేజ పేరు ప్రస్తావించలేదు. బహుశా ఇందులో రవితేజ, రేణు దేశాయ్ కాంబోలో సీన్స్ ఉండకపోవచ్చు అని సమాచారం. అందువల్లనే రవితేజ ప్రస్తావన తేలేదని అంటున్నారు!

Exit mobile version