Rohit Sharma: ప్రస్తుతం టీమిండియా విండీస్ టూర్‌తో బిజీగా ఉంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు గురువారం రోజు తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన కూడా భారత అభిమానులు అంత సంతృప్తిగా లేరు. 115 పరుగుల స్వల్ప లక్ష్యం సాధించేందుకు ఐదు వికెట్స్ కోల్పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఈ మ్యాచ్‌లని ప్రిపరేషన్స్‌గా భావిస్తున్న సిరీస్ లో భారత యంగ్ బ్యాటర్లు, బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా పూర్తిగా నిరాశపరిచారు.
అయితే 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి తొలి వన్డేలో విజయాన్ని అందుకుంది టీమిండియా. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/37), కుల్దీప్ యాదవ్(4/6) అద్భుతమైన బౌలింగ్‌థో విండీస్ పతనాన్ని శాసించారు. ఇక భారత స్పిన్నర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీయడంతో విండీస్ 114 పరుగులకి ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాటర్లలో షై హోప్ (45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కాస్త రాణించారు.స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియా మంచి శుభారంభం అందుకోలేకపోయింది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయకుండా ఇషాన్ కిషన్‌తో శుభ్‌మన్ గిల్(7) బరిలోకి దిగారు. టెస్టలో పూర్తిగా విఫలమైన గిల్ తొలి వన్డేలో కూడా నిరాశపరిచాడుజ
ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.. ఆ తర్వాత విండీస్ కెప్టెన్ షైహోప్ స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. సూర్యకుమార్ యాదవ్(19)ఎల్బీగా పెవీలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(5) రనౌటవ్వగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(1) కూడా త్వరగా ఔట్ కావడంతో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ(12 నాటౌట్).. రవీంద్ర జడేజా(16 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్.. శార్ధూల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంతికి బౌండరీకి వెళుతున్న సమయంలో దాని వెనక లేజీగా పరిగెత్తాడు శార్ధూల్. దాంతో వారు మూడు పరుగులు తీసారు. దీనిపై రోహిత్ ఫైర్ కావడం కెమెరాలలో రికార్డ్ అయింది.
Rohit Sharma praising Shardul Thakur for his fielding effort.#INDvsWI pic.twitter.com/121NrAKQhY
— Foax Cricket News (@FoaxCricket) July 27, 2023