Rupert Murdoch | 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న రూపర్ట్ మర్దోక్..!

Rupert Murdoch | ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (92)కు నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. విడాకులు ఇచ్చాడు. ఇటీవల తన ప్రేయసి ఆన్‌ లెస్లీ స్మిత్‌ (66)తో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇద్దరికి మార్చి 17న న్యూయార్క్‌లో నిశ్చితార్థం జరిగింది. వేసవిలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. లెస్లీతో అభిప్రాయభేదాలు వచ్చాయని, దాంతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడని పేర్కొన్నాడు. […]

  • Publish Date - April 5, 2023 / 06:15 PM IST

Rupert Murdoch | ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (92)కు నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. విడాకులు ఇచ్చాడు. ఇటీవల తన ప్రేయసి ఆన్‌ లెస్లీ స్మిత్‌ (66)తో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇద్దరికి మార్చి 17న న్యూయార్క్‌లో నిశ్చితార్థం జరిగింది.

వేసవిలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. లెస్లీతో అభిప్రాయభేదాలు వచ్చాయని, దాంతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడని పేర్కొన్నాడు.

ఈ ఏడాది మార్చి 17న జరిగిన ఎంగేజ్మెంట్ సమయంలో తనకు ఇది చివరి పెళ్లి అని, సంతోషంగా ఉందని వ్యాపారవేత్త మర్దోక్ తెలిపాడు. ఎంగేజ్మెంట్‌ సమయంలో డైమండ్ రింగ్‌ను స్మిత్‌కు అందించాడు. న్యూయార్క్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించినా.. రూపెర్ట్ మర్దోక్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

మొదట పెట్రిసియా బుకర్ అనే మహిళను పెళ్లి చేసుకొని.. 1960 చివరిలో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రిపోర్టర్ అన్నా మరియా మన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు 30ఏళ్లకు పైగా దాంపత్య జీవితాన్ని కొనసాగించి 1999లో విడాకులు తీసుకున్నారు.

అనంతరం వెండీ డెంగ్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2013లో విడాకులు ఇచ్చాడు. 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్న మర్దోక్.. గతేడాది ఆగస్టు నెలలో విడాకులు ఇచ్చింది. 92 సంవత్సరాల వయసులో మర్దోక్‌.. 66 సంవత్సరాల ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రేమలో పడ్డాడు.

అన్‌ లెస్లీ స్మిత్ భర్త సైతం 2009లో చనిపోయాడు. ఇదిలా ఉండగా.. ‘ఫోర్బ్స్’ ప్రకారం.. న్యూస్ కార్ప్ చైర్మన్, సీఈవో అయిన ముర్దోక్ ఆస్తి విలువ దాదాపు 17 బిలియన్లు. ఆయన ఫాక్స్ న్యూస్, వాల్‌స్ట్రీట్ జర్నల్ సహా ప్రపంచవ్యాప్తంగా మరెన్నో మీడియా సంస్థలకు అధిపతి.

Latest News