Site icon vidhaatha

సెలెక్ష‌న్ క‌మిటీకి ద‌ర‌ఖాస్తు చేసిన స‌చిన్, సెహ్వాగ్‌, ధోనీ..!

ముంబ‌యి : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త‌జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న తర్వాత చేత‌న్ శ‌ర్మ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీపై బీసీసీఐ వేటు వేసింది. ఆ త‌ర్వాత కొత్త సెలెక్ష‌న్ క‌మిటీ నియామకానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌గా.. అప్లికేష‌న్లు వెల్లువెత్తాయి. ఐదుగురు స‌భ్యుల సెలెక్ష‌న్ క‌మిటీ ప్యానెల్ కోసం దాదాపు 600కిపైగా అప్లికేష‌న్లు మేయిల్ ద్వారా అందాయి. క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు పాక్ మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ పేరిట సైతం ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

దిగ్గ‌జ క్రీడాకారుల ద‌ర‌ఖాస్తుల‌ను చూసి బీసీసీఐ అధికారులు సైతం ఖంగుతిన్నారు. నిజంగానే సెలెక్ష‌న్ క‌మిటీ కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారా? అనుమానంతో బ‌యోడేటాల‌ను నిశితంగా ప‌రిశీలించ‌గా.. ఫేక్ ఈమెయిల్ ఐడీతో ద‌ర‌ఖాస్తులు పంపిన‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ వార్త‌లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయింది. సెలెక్ష‌న్ క‌మిటీ కోసం దాదాపు 600 ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని, ఇందులో సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ పేర్లున్నాయ‌ని, న‌కిలీ మేయిల్ ఐడీల‌తో కొంద‌రు వ్య‌క్తులు ద‌ర‌ఖాస్తులు పంపి.. స‌మ‌యాన్ని వృథా చేస్తున్నార‌ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. ద‌ర‌ఖాస్తుల నుంచి క్రికెట్ స‌ల‌హా క‌మిటీ ప‌ది పేర్ల‌తో షాట్‌లిస్ట్ చేస్తుంది. ఆ త‌ర్వాత ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించ‌నున్న‌ది.

Exit mobile version